Competitive PRESS RELEASE

Remembering Bhagat Singh, Rajguru, Sukhdev: India will never forget their sacrifice, says KANNA Lakshmi Narayana

దేశ  స్వాతంత్ర్యము కోసం అశువులు బాసిన అమరవీరులారా_లాల్_సలాం

నేడు  షహీద్ భగత్ సింగ్,     రాజ్ గురు,    సుఖ్ దేవ్ –వర్ధంతి..

 

Exactly 87 Years Ago, భరతమాత దాస్య శృంఖలాల విముక్తి కోసం జరిపిన పోరాటంలో బ్రిటీష్ ముష్కరుల చేత అమానుషంగా ఉరి తీయబడిన రోజు.

బ్రిటీష్ వలస పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన భరత మాత #ముద్దుబిడ్డలు భగత్ సింగ్,రాజ్ గురు ,సుఖ్ దేవ్ లు. బ్రిటీష్ పాలకుల #గుండెల్లో రైళ్ళు పరుగెట్టించిన సమరనినాదం “ఇంక్విలాబ్ జిందాబాద్” యువత లో స్వాతంత్ర్య కాంక్షను #రగిలించిన యువ కిశోరాలు. దేశభక్తిని ఆచరణలో చూపిన అసలైన #విప్లవకారులు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరులో ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన వీరయోధులు

సుఖ్ దేవ్ థాపర్ (15 మే 1907 – మార్చి 23, 1931)

భారత స్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి “జె.పి. సాండర్స్” ను హతమార్చినందులకు గాను మార్చి 23 1931 న ఉరితీయబడ్డాడు.

ఈ ముగ్గురు విప్లవకారులు (భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్) లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం జరిగేది కాదు. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళి సట్లెజ్ నదితీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేశారు. మృత దేహాను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.

సుఖదేవ్  హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థలో ముఖ్యమైన నాయకుడు. లాహోర్ నేషనల్ కాలేజిలో భారత పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచ విప్లవ పరిణామాలు పరిశీలించడానికి ఒక అధ్యయన కేంద్రాన్ని (స్టడీ సర్కిల్) ప్రాంభించాడట. తన సహచరులైన భగత్ సింహ్, కామ్రేడ్ రామచంద్ర, భగవతీ చరణ్ వోహ్రా లతో కలిసి లాహోరులో “నవ జవాన్ భారత సభ” ప్రారంభించాడు. దేశ స్వాంతంత్ర్యానికి యువతను ఉత్తేజితులను చేయడం, ప్రజలలో హేతువాదాన్నిపెంపొందించడం, మతవైషమ్యాలను నిరోధించడం, అంటరానితనాన్ని అరికట్టడం ఆ సంస్థ ఆశయాలు.

పండిట్ రామప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర ఆజాద్‌ల ప్రభావం సుఖదేవ్‌పై బలంగా ఉంది. ఖైదీలపట్ల చూపుతున్న అమానుష విధానాలకు వ్యతిరేకంగా 1929లో జరిగిన నిరాహార దీక్షలో సుఖదేవ్ పాల్గొన్నాడు. సుఖదేవ్‌ను ఉరి తీయడానికి ముందు అతను మహాత్మా గాంధీకి ఒక లేఖ వ్రాశాడు. విప్లవ మార్గంలో ఉద్యమిస్తున్న వారిపట్ల మహాత్మా గాంధీ అనుసరిస్తున్న ప్రతికూల ధోరణిని ఈ లేఖలో సుఖదేవ్ విమర్శించాడు. సుఖదేవ్‌కు ఉరి శిక్ష వేయడానికి ఆధారమైన ప్రధాన సాక్ష్యం హంసరాజ్ వోహ్రా ఇచ్చాడు. అయితే సుఖదేవ్ స్వయంగా నేరాన్ని అంగీకరించాడని వోహ్రా చెప్పాడు.

శివ రామ్ హరి రాజ్గురు (ఆగష్టు 24, 1908 – 23 మార్చి 1931)

మహారాష్ట్ర నుండి ఒక భారతీయ విప్లవకారుడు, బ్రిటీష్ రాజ్ పోలీసు అధికారి హత్యలో  ప్రధానంగా పిలవబడ్డాడు.

రాజ్గురు పుణే సమీపంలోని ఖేడ్లో బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడిగా ఆయన ఉన్నారు, వీరు బ్రిటీష్ పాలన నుండి భారతదేశాన్ని ఎటువంటి అవసరం లేకుండా విముక్తి చేయాలని కోరుకున్నారు. మహాత్మా గాంధీ చేత అహింసాత్మక శాసనోల్లంఘన కంటే బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా ఉద్రిక్తత మరింత ప్రభావవంతంగా ఉందని అతను నమ్మాడు.

రాజ్గురు భగత్ సింగ్ మరియు సుఖ్దేవ్ యొక్క సహోద్యోగి అయ్యాడు మరియు 1928 లో లాహోర్లో ఒక బ్రిటీష్ పోలీసు అధికారి JP సౌండర్స్ హత్యలో పాల్గొన్నాడు. వారి చర్యలు లాలా లాజ్పాత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాయి, సైమన్ కమీషన్ నిరసన ప్రదర్శనలో పోలీసులు వెళ్లారు.  రాయ్ మరణం పోలీసు చర్య నుండి వచ్చింది, తరువాత జరిగిన ఒక సమావేశానికి ప్రసంగించినప్పటికీ.

 

 

Topics