BJP NEWS PRESS RELEASE

babu jagjivan Raam’s birth day – Kanna Lakshmi Narayana – Modi

బాబూ జగ్జీవన్‌రామ్   గారి జయంతి

Image result for babu jagjivan ram kanna

స్వాతంత్ర్య సమరయోధుడు,మొట్టమొదటి భారత క్యాబినెట్ లో అత్యంత పిన్నవయస్కుడైనమంత్రిగా చరిత్ర సృష్టించిన నేత. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించిన మహానాయకుడు.

విద్యావేత్తగామచ్చలేని నిస్వార్ధ నాయకునిగా, కరవు కోరల్లో చిక్కిన భారతావనిని వ్యవసాయ మంత్రిగా “హరిత విప్లవాన్ని” సాకారం చేసి, భారత్ కు ఆహార గిడ్డంగుల నేర్పరిచిన దార్శనీకునిగా, బ్రిటిష్‌ కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులు వేసిన రైల్వేమంత్రిగా, కయ్యానికి కాలుదువ్విన శత్రువును మట్టికరిపించి భారతదేశానికి విజయాన్ని అందించిన భారత సేనకు రక్షణశాఖామంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి యావత్‌ భారత్‌ ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్న ఆ మహా నాయకుని జయంతి సందర్భంగా నా ఘననివాళి.

 

Topics