యువతే ఆదర్శం

గుంటూరు జిల్లా ,నెహ్రూ నగర్ రోడ్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 30 రోజులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.జనసేన యువత తమ సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు.కుల ,మతాలకు అతీతంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని జనసేన యువత తెలిపారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జనసేన యువత Sikha Balu,bhargav,uday,krishna,sriDhar ,Vamsi,Prakash,gopi,Saiఇంకా కొంత మంది కార్యకర్తలు ఉన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు – శిక్కా బాలు. MDN NEWS తో మాట్లాడుతూ
మండే ఎండలు ఒకపక్క పేపర్ చలివేంద్రాలు ఒక పక్క , పెరుగుతున్న ధరలు ఒకపక్క –
పేదవాడి నడ్డి విరిచి గడ్డి కరిపిస్తున్నాయి – కానీ ఈ ఎండలకు కనీసం పశువులకు కూడా గడ్డి దొరకడం లేదు,
స్టూడెంట్ ఫెయిల్ అయితే టీచర్ కారణం – అదేసమయం లో తన సొంత తప్పిదాలు (సెలక్షన్ అఫ్ ప్రొపెర్ సబ్జెక్టు అండ్ సెలక్షన్ స్కూల్/కాలేజీ లు కూడా కారణం )ఎలాగయితే కారణం అవుతాయో , అలానే మన పరిస్థితికి ,సమాజ దుస్థితికి మన VOTE మాత్రమే కారణం,
కనీసం పట్టణంలో మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఒక వైపు – అకాల Diarrhea ఒకవైపు ,
ఇలా ఉంటే కొన్ని టీవీ ,న్యూస్ ఛానెల్స్ లో వచ్చే Heritage Butter milk చలివేంద్రం వార్తలు వింటే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ,
మేము –
మా స్నేహితులం అందరం కలిసి ఒక రోజు టీ కొట్టు దగ్గర బాతాకాని వేస్తుంటే
( మీకు తెలిసిందేగా యూత్ అంటే కుటుంబ బాధ్యతల దృష్ట్యా – మరియు ప్రస్తుత ప్రభుత్వాల తెలివైన – మాట తప్పని హామీ ” జాబు కావాలంటే బాబు రావాలి ” ,చదివిన చదువుకు ఉద్యోగం దొరక్క పోవడం వలన కస్టపడి పనిచేయడం , ఇంకా సాయంత్రానికి ఆ కస్టాలు పంచుకొంటూ కబుర్లు చెప్పుకోవడం).
మా కు మాటల మధ్య పైన వివరించిన పరిస్థులు చర్చకు వచ్చాయి .
అంతే – ఇక తలా ఒక చేయి వేసి – ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించాము. మాకు నచ్చినది మేము చేస్తున్నాము మాకు ఆదర్శమైనది మేము అనుసరిస్తున్నాము.
ఇంకా ఎవరైనా మాతో చేయి కలప దలచుకుంటే – రండి , We are always welcome for a change.
మేరె చుడండి నగరం లో ఎక్కడైనా మజ్జిగ చలివేంద్రాలు కానీ మంచినీళ్ల చలివేంద్రాలు వున్నాయో లేదో మనం నగర ప్రజలను అడిగితెలుసుకుందాం
Please email Us for updates and corrections – publish@mydigitalnews.in – whats app 888 5555 924,
Send us NEWs with genuine information to whatsapp / by email- we will publish them,
Mari meru pettamdi