AP politics BJP

పాటిబండ్ల రామకృష్ణ- గారి సంచలన వ్యాఖ్యలు

తెనాలి లో అందరికీ సుపరిచితులు , చిరు ధర హాసులు సౌమ్యులు అయిన శ్రీ పాటిబండ్ల రామకృష్ణ-Patibandla

జై భారత మాతా . జై బి.జె.పి… జై నరేంద్ర మోడీ… అను నినాదం తో సంచలన వ్యాఖ్యలు చేశారు .

పాటిబండ్ల రామకృష్ణ  గారి వ్యాఖ్యలు తెనాలి రాజకీయ పరిస్థితులను మార్చేలా వున్నాయి అని కొందరు, కాదు ఇది మార్పుకు నిదర్శనం అని కొందరు ,కాదు కాదు మంచి కి రోజులు మొదలు అయ్యాయి అని కొందరు అంటున్నారు,

బీజేపీ శ్రేణులూ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎటువంటి పొత్తులూ లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ విషయం అమిత్ షా గారు స్పష్టం చేసేసారు. అదే విషయం రాం మాధవ్ గారు కూడా చెప్పేరు కావున పొత్తులు పై స్పెక్యులేషన్స్ వద్దు.

బీజేపీ జాతీయ పార్టీ. నిబద్ధత విలువల గల వైవిద్యమైన పార్టీ. దేశ భక్తి అణువణువునా నింపుకున్న స్వయం సేవకుల పార్టీ. మహనీయులు ప్రవచించిన అంత్యోదయా ఆశయ సాధన కోసం అహోరాత్రులు అంకితభావంతో పనిచేస్తున్న పార్టీ. కుల మత అవినీతి కుటుంబ వారసత్వ పాలనకు బీజేపీ పూర్తిగా విరుద్ధం.

కాంగ్రెస్ తో బాటు మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నీ ఇప్పుడు ఏకమై బీజేపీ ని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. ఢిల్లీ-మీరట్ రోడ్ ప్రారంభోత్సవం సందర్భంగా భాగపట్ సభ లో నరేంద్రమోదీ గారు స్వయం గా మీ కుటుంబ పార్టీలు అన్ని ఒక వైపు , బీజేపీ మాత్రం 125 కోట్ల దేశ ప్రజల వైపు , రండి తేల్చుకుందాం అని 2019 ఎన్నికల కురుక్షేత్రానికి బరిగీసేరు.

యూపీ లో రెండు ఉప ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ అనైతిక కలయిక కర్ణాటక లో బహిరంగంగా బీజేపీ కి సవాల్ విసిరింది.

ఒక ముఖ్యమంత్రి అంటాడు కేంద్రానికి పన్నులే కట్టద్దు అని. మరొక ముఖ్యమంత్రి అంటాడు నేను కాంగ్రెస్ కు విశ్వాసపాత్రుడుని కానీ ప్రజల కు ఏమాత్రం కాదు అని. ఇంకో ముఖ్యమంత్రి తన అధికారం కోసం రోహింగీలుతో హిందూ దేశం లో హిందువుల పై మారణకాండ జరుపుతోంది. ఒక కమ్మీ ముఖ్యమంత్రి ఏమో స్వయం సేవకులను రక్తపాతం లేకుండా ఉప్పు పాతర ఎలా వేయాలో నేర్పుతాడు. కాంగ్రెస్ యువ రాజు ఏకంగా పాకిస్తాన్ చైనా లకు వత్తాసు పలుకుతాడు.
ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ప్రపంచంలో అతి పెద్ద రాజకీయపార్టీ , 12 కోట్ల మంది కార్యకర్తలు , 20 రాష్ట్రాల ముఖ్యమంత్రు లు , 85% భారత్ భూభాగాన్ని పాలిస్తున్న బీజేపీ ని సమర్ధిస్తే రాష్ట్రద్రోహం అంటున్నారు.
నరేంద్రమోదీ సహనాన్ని బలహీనత గా భావించి చెలరేగిపోతున్న వీళ్ళు కదా అసలు అయిన దేశద్రోహులు?

నిరుపేదలకు , మధ్యతరగతి వాళ్లకు , యువతకు , మహిళలు కు అండగా నిలిచిన బీజేపీ ని రక్షించుకోవడం మన తక్షణ కర్తవ్యం. దేశం కోసం ధర్మం కోసం ఈ 2019 లో జరగబోయే కురుక్షేత్రానికి మనమంతా సైన్యం గా పని చేయాలి.

బీజేపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, నరేంద్రమోదీ గారి అభిమానులు , పార్టీ సానుభూతి పరులు , దేశ భక్తులు , అందరూ ఒక త్రాటిన ఏకం కావాలి. ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభించాలి. ప్రజల్లో అవగాహన చైతన్యం పెంచాలి. క్షేత్ర స్థాయిలో చాప క్రింద నీరులా పాకిపోవాలి.

2019 బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ దేశ ప్రగతి ఎవరూ ఆపలేరు. అలాగే ఈ దేశద్రోహులు ఇంక మన దేశంలో బ్రతకలేరు. కుల మత కుటుంబ పార్టీలు అంతరించిపోతాయి. నవ భారత్ తో బాటు నవ్యాంధ్ర కూడా సాధిద్దాం.

ఈ సందర్భం గా పాటిబండ్ల రామకృష్ణ మరో గొప్ప సందేశం ఇచ్చారు ,
యువకుల రక్తం ఉడికించేలా , వుంది

దేశం కోసం మరణించే అవకాశం ఎటూ రాలేదు.
దేశం కోసం జీవిద్దాం. బీజేపీ ని గెలిపిద్దాం.
నరేంద్రమోదీ ని మరో సారి ప్రధాని గా చేద్దాం.
ఆంధ్ర ప్రదేశ్ లో కమలం వికసించే తరుణం కోసం
అహోరాత్రులు శ్రమిద్దాం…

 

పాటిబండ్ల రామకృష్ణ

( తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్
మరియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి )

 

Please email us for updates and corrections Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924,

Topics