PRESS RELEASE

24న రాజమహేంద్రవరంలో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్రస్థాయి సమావేశం

రాజమహేంద్రవరం : ఈ నెల 24 న జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర కల్యాణమండపం నందు రాష్ట్రస్థాయి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సమావేశం అన్ని చేనేత కులాల నాయకులు, ఉద్యమకారులు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో జరపనున్నామని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్, అంబాజీపేట మండల పరిషద్ అభివృద్ధి అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. స్థానికి ఉమారామలింగేశ్వర కళ్యాణమండపములో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కాలెపు సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన సన్నాహా సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ విశ్వనాధ్ మాట్లాడుతూ రాష్టంలో 14 హోమోజినియస్ చేనేత కులాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 14 శాతం ఉన్నా రాజకీయ, సామజిక గుర్తింపు లేకపోవడం వలన భవిషత్ కార్యవచరణలో భాగంగా అన్ని చేనేత సంఘాలు చేతులు కలపనున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని, రాష్ట్ర చరిత్రలో ఇది నూతనాధ్యాయమని అన్నారు. అజండాగా చేనేత కులాల సంఘాల పునరేకీకరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సంస్థాగత నిర్మాణం, ‘హై పవర్ కమిటీ’ ఏర్పాటు, చేనేత కులాల కార్పొరేషన్ ఏర్పాటు, చేనేత కులాల మేనిఫెస్టోపై చర్చ ముఖ్యంగా రానున్న ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్, అసెంబ్లీలలో చేనేత వర్గీయులకు అవకాశం, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పొలిట్బ్యూరో ఏర్పాటు, విజయవాడలో మూడు లక్షల మందితో చేనేత కులాల ఆత్మగౌరవ సభప్ తదితర అంశాలపై చర్చనున్నామని అన్నారు. కార్యక్రమంలో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కో-కన్వీనర్లు శల కోటి వీరయ్య, కె.కె. సంజీవరావు, రాజపంతుల నాగేశ్వరావు, నక్కిన చినవెంకటరాయుడు, పుచ్చల రామకృష్ణ, శీరం లక్ష్మణ ప్రసాద్, యెర్ర సోమలింగేశ్వరావు, చిందం రాధాకృష్ణ, కరెళ్ళ గణపతిరావు, చింత చలపతిరావు, పెడన మునిసిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, డా. కళ్యాణ్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ధన్యవాదములు

తూతిక శ్రీనివాస విశ్వనాధ్
రాష్ట్ర కన్వీనర్, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్, ఆంధ్రప్రదేశ్
7675924666

Topics