AP politics BJP TDP

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత-అవినీతి-ఈ ప్రశ్నలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా ??03

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

3వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు:

1.సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుండి తీసుకుని, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా దారుణంగా వంచించి, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మెజారిటీ వాటా (58%) సింగపూర్ సంస్థలకు దోచిపెట్టడం లేదా?? రాజధాని భూ కుంభకోణం పై సిబిఐ విచారణకు సిద్దమా ??

2. మీరు అధికారంలోకి వచ్చే సమయానికి రు.లక్ష కోట్లు ఉన్న రాష్ట్ర రుణ భారం, ఇప్పుడు ఏకంగా రు.2.35 లక్షల కోట్లకు ఎందుకు పెరిగిందో ప్రజలకు సంజాయిషీ ఇవ్వగలరా ?? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా ??

3. గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోవడానికి మీ ప్రచార పిచ్చి కారణం కాదా ?? మీ వనం-మనం కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఐ.పోలవరంలో అమాయాక విద్యార్ధులు చనిపోవడం నిజం కాదా ?? మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు భాద్యత వహించాల్సిన అవసరం లేదా ??

4. ప్రత్యేక ప్యాకేజీకి అంగికరించి, అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానం చేయించింది మీరు కాదా ?? ప్యాకేజీలో భాగంగా నిధులు తీసుకుంటూనే, ప్రత్యేక హోదా కావాలనడం దుర్మార్గం కాదా ?? ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసినది మీరు కాదా ??

5. పారదర్శక పాలన అందిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే మీరు అత్యధిక సంఖ్యలో రహస్య జి.ఓ లను జారీ చేసిన విషయం నిజం కాదా ?? అసలు రహస్య జి.ఓ లను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?? ఇవన్నీ అవినీతి కోసం కాదా ??

పూర్తిగా అవినితీలో కూరుకుని అనేక అరాచకాలు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ఎండగడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ఈ ప్రశ్నలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా ??

     

Please email us for updates and corrections -Publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss