AP politics

ప్రత్యేక హోదాకోసం జరుగుతున్న బలిదానాలకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలి

బలిదానాలకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలి

కాకినాడ : విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ అవసరమని తెలిసినా రాజకీయ పార్టీలన్నీ కలిసి ఉమ్మడి లక్ష్యం కోసం పోరాటం చెయ్యకపోవడం చాల బాధాకరమని ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంబాజీపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం చిత్తూరు జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు సురేష్ ఆత్మబలిదానం విషయంలో విశ్వనాధ్ స్పందించారు. రాజకీయ పార్టీలు అన్ని ప్రత్యేక హోదా అనే సెంటిమెంటును అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలను వెర్రివెంగళప్పలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేసారు. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న పార్టీలు, పోరాటాల ద్వారా హోదా సాధిస్తామన్న పార్టీలు బాగానే ఉన్నాయని మధ్యలో అమాయకులు ఆత్మహత్యలు చేసుకోవడం చాల దురదృష్టకరమని అన్నారు.
ప్రత్యేక హోదా కేంద్రప్రభుత్వమే ఇవ్వాలని కానీ కేంద్రం హోదా ఇవ్వలేమని ప్రకటించిన తర్వాత కూడా మా పార్టీకి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే హోదా సాధించి తీరుతామని ప్రజలను మోసం చెయ్యడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటె ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు ఒకే వేదికగా పోరాడితే ప్రజల మద్దత్తు ఉంటుంది గాని తమ సొంత ఎజండాతో ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మబ్బిపెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. చేనేత కార్మికుడు సురేష్ ఆత్మహత్యకు అన్ని రాజకీయ పార్టీలు భాద్యత వహించాలని అన్నారు. బడ్జెట్టులో కోత జీఎస్టీ మోత వలన చేనేత రంగం అంపశయ్య మీద ఉంటె ఇటువంటి ఆత్మహత్యల వలన నేతన్నల కుటుంబాలకు దిక్కెవరని విశ్వనాధ్ ప్రశ్నించారు. ఆత్మహత్యల వలన సాధించేది ఏమి లేదని, ప్రత్యేక హోదా సెంటిమెంటును అడ్డంపెట్టుకొని  రాజకీయ పార్టీలు ఆడుతున్న వికృత క్రీడలో రాష్ట్ర ప్రజలందరు అప్రమతంగా ఉండాలని సూచించారు. ఆత్మార్పణం చేసుకున్న సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంభంలో అర్హత గల వ్యక్తికి ప్రభుత్వంలో ఉద్యోగం కల్పించాలని విశ్వనాధ్ డిమాండ్ చేసారు. త్వరలో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రతినిధులు సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించడానికి చిత్తూరు వెళ్లనున్నారని అన్నారు.
Please email us for updates and corrections – Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

Topics