NEWS

సైకిల్ పై ఓ స్త్రీ మృతదేహం తరలింపు.

ఒక కాకి చనిపోతే.. పది కాకులు అరుస్తూ చుట్టూ మూగుతాయి. కనీసం కాకుల్లో ఉన్న అభిమానం కూడా మనుషుల్లో కరువైంది. మానవత్వం చచ్చిపోయిందనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఉండదు. ఒడిశాలో పదే పదే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. తాజాగా మరదలి మృతదేహాన్ని ఓ వ్యక్తి సైకిల్ కి కట్టేసి తీసుకెళ్తున్న దృశ్యం ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టిస్తోంది. బంధువులు కూడా నిరాకరించడంతో
మృతదేహాన్ని తరలించడానికి ఆ నలుగురు కరవయ్యారు. దీంతో తన మరదలి శవాన్ని బావ సైకిల్‌పై శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. గ్రామాల్లో కట్టుబాట్లు ఇంకా మారడంలేదనేందుకు దృష్టాంతంగా నిలిచిన ఈ ఘటన వివరాల్లోకెళితే.. బౌద్ధ్‌ జిల్లా బ్రాహ్మణిపల్లి పంచాయతీ కృష్ణపల్లి గ్రామానికి చెందిన పంచు మహకుద్‌ అనే యువతి రెండు రోజుల కిందట అతిసార వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొచ్చి గ్రామంలో ఆమె బావ ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. ఆమె అక్కడే నివసించేది. ఇటీవల వారి కుటుంబంలో ఒకరికి వివాహమైంది. ఆ వివాహం సందర్భంగా విందు భోజనం పెట్టలేదని గ్రామస్థులు, బంధువులు ఈ కుటుంబాన్ని వెలేశారు. బుధవారం మృతదేహాన్ని శ్మశానానికి తరలించడానికి ఎవరూ రాలేదు. దీంతో పంచు మహకుద్‌ బావ మృతదేహాన్ని సైకిల్‌కు కట్టుకుని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించాడు.

Please email us for updates and corrections – Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss