Celebrities

Police the celebrity – By MDN NEWS

పోలీస్ అనగానే , ఈ సమాజం లో చాలా చేదు అభి ప్రాయం వుంది , ముఖ్యం గా మధ్య తరగతి వారికి గుర్తుకు వచ్చేది , బైక్ ఆపి హెల్మెట్ లేదని డబ్బులు వసూలు చేయటం , పోలీస్ సైరెన్ వినగానే మైండ్ లో ఏదో తెలియని ఆందోళన , లంచాలు తీసుకుంటారు అని అపోహలు చాలా వున్నాయి,  కానీ ఒక్క సారి మీద హగ్గరలో వున్నా పోలివారికి (మనసుకు ) దగ్గర అయి చుడండి మీకేతెలుస్తుంది మీరు ఎంత అపార్ధం చేసుకుంటున్నారో అని. ఈ పర్యాయం లో ఒక అభిమాని ” చందు ” తనకు దగ్గర అయిన ఒక పోలీస్ ఆఫీసర్ గురించిన చిరు జ్ఞాపకాన్ని MDN న్యూస్ తో పంచుకున్నాడు .
అతని మాటల్లోనే చుడండి .

Sri .గజ్జలనరేష్  Sub Inspector Of POLICE (ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం,వంగాముత్యాల బంజర పోలీస్ స్టేషన్ కి చెందిన యస్ఐ గారు)

మీ వెన్నెలాంటి మనసుకు నా కోటిముద్దులు అన్నయ్య. ఈ సంఘటన చూసి ఈరోజులలో కూడా రక్షకభటులున్నారని తెలుసుకొని మీ గురించి క్లుప్తంగా
నాకు జ్ఞాపకమొచ్చాక మా మండల పోలీసు స్టేషన్ లో చేసిన SI గార్లలో నాకు బాగా ఇష్టమైన వారిలో మొదటి వారు శ్రీ కరుణాకర్ సారు ,మీకు గౌరవ శ్రీ సారు గారి జన్మదినాన మీకు విన్నవించి చెప్పాను.
ఇక రెండో వారు గౌరవ శ్రీ గజ్జల నరేష్ అన్నయ్య ,వరంగల్ జిల్లా కురవి గ్రామానికి చెందిన మధ్య తరగతి కుటుంబానికి చెందిన నరేషన్న .చదువులో సరస్వతీ పుతృడనాలి. అసలు పరిచయమైతే లేదు కానీ, ఎందుకో సారు ని అన్నయ్యా అని పిలవాలనిపించింది.(సారు కి పరిచయమున్న వాళ్ళ దగ్గర గౌరవ సారు గారి ముచ్చట వస్తే నేను మా గజ్జల నరేష్ అన్నయ్య అని సంభోదించడం అలవాటయ్యింది,ఇప్పుడు వాళ్ళు మీ నరేషన్న అని చెప్పడం వాళ్ళకి అలవాటయ్యింది.
ఇక అన్నయ్య వయసు చిన్నదే అయిన మనసు మాత్రం చానా పెద్దది.నాకు తెలిసి ఖమ్మం జిల్లాలో అదీ పెనుబల్లి మండలంలో ఏ ఉద్యోగం చేయడమన్నా కత్తి సాము లాంటిది.ఎందుకంటే ఇక్కడ నుండి శాసనసభ్యుల నుండి మంత్రులు,ముఖ్యమంత్రి కూడా ఇక్కడ నుండి ప్రాతినిత్యం వహించిన పరిస్తితి.వాళ్ళ అనుచరులుగా ఉన్నవాళ్లు ఈ రోజు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు.వీరి మద్యలోకి మొదటి పోస్టింగులో వచ్చి, సమతుల్యంగా,వివాదరహితునిగా పేరుతెచ్చుకొని , ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నినాదాన్ని నిజం చేసి చూపించారు.

అలాగే హరితహారం పేరుతో పోలీసుశాఖ ఆద్వర్యంలో మొక్కలు నాటటం, ముఖ్యంగా మహిళలు,విధ్యార్దునులకు భద్రత విషయాలలో పెనుబల్లిలోని అన్నీ కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్దులను చేతన్యపరిచారు.చదువులో మండల స్థాయిలో మంచిగా చదువుకోని,ర్యాంకులు తెచ్చుకున్న విధ్యార్దినీ,విద్యార్దులకు సన్మానం,చిరుకానుకలను అందచేసి వాళ్ళని ప్రోత్సహించడం (విన్నాను). రాష్ట్రీయ రహదారులకు ఆనుకొని (ఇరువైపుల) ఉన్న మధ్యం మహమ్మారిని (బెల్టు షాపులు) ప్రారతోలి ఎన్నో రోడ్డు ప్రమాదాలను అరికట్టారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఇటీవల జరిగిన రామాలయం ప్రతిష్ట కార్యక్రమంలో అనూహ్యంగా సంభవించిన గొడవలో చాలా చాఖచఖ్యంగా వ్యవహరించి మండల ప్రజలమన్ననలు పొందడం జరిగింది.


అందరూ  షేర్ చేసి సెల్యూట్ చేద్దాం!!
చందు ,టేకులపల్లి,పెనుబల్లి మండలం ,ఖమ్మం జిల్లా
+91 950 243 4151

Please Email us for Updates and corrections – publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics