NEWS

నీళ్ళు తిరిగే కళ్ళ తో జగన్ గురించి నిజం చెప్పిన ఓక ….

అందరూ జగన్ గారికి కోపమెక్కువ,గర్వం,ఎవరి మాట లెక్కచేయరు,తన మాటే వేదం,పెద్దలను గౌరవించడు అని అన్నప్పుడు నాకూ చాలా కోపమొస్తుంది,అలాగే చాలా బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆయనను ఓదార్పుయాత్ర మా జిల్లా (ఖమ్మం)లో నేను దగ్గరగా,ప్రత్యక్షంగా చాలా సార్లు గమనించాను.రాయలసీమ యాసతో మాట్లాడినా చాలా వినయంగా,నిక్కచ్చిగా మాట్లాడేవారు.నాకు అసలు పెద్దాయనకు (వైయస్ రాజశేఖర రెడ్డి ) ఒక కొడుకున్నాడని ఓదార్పుయాత్ర సమయంలోనే తెలుసు.అప్పుడు నేను ట్రాక్టరు నడుపుతుండెవాన్ని,యాత్ర మాఊరికి అదిగో వస్తుంది,ఇదిగో వస్తుందన్నాక 3 రోజులు తర్వాత అదీ కూడా రాత్రి 12:40 కి వచ్చి మా ఊర్లో మా గ్రామ నాయకులు శ్రీ కీసర శ్రీనివాసరెడ్డి గారు స్తాపించిన పెద్దాయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఆతర్వాత మా నాయకుని ఇంట్లోనే బస ఏర్పాటు చేయడం,ఆయనకు నేను బాగా దగ్గర కావడంవలన ఆరోజు మా గ్రామ నాయకుని ఇంట్లో చూసి ,కలిసే భాగ్యం కలిగింది.అప్పుడు పొటో తీసుకోవాలని తెలియదు.కాని అప్పటి నుండి పెద్దాయన పుట్టినరోజుకు సమాధి (ఇడుపులపాయ) దగ్గరకు వెల్లడం అలవాటుగా మారింది.అక్కడకు వెల్లిన సంధర్భంలో పులివెందుల ఇంటికి వెల్లాను అప్పుడు శ్రీ జగన్ గారితో నా సంభాషణ చూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించింది.
ఈ చిత్రం , ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేను.
జగనన్న : ఏం చందూ మళ్ళేందబ్బా!!
నేను: అన్నా ఇందాక ఫొటో మంచిగా రాలేదన్నా (అప్పటకి జగనన్న కారు ఎక్కారు.)
జగనన్న : ఏం అబ్బా ఇంకోసారి తీసుకుందువ్ లే
నేను : అన్నా నాకు అవకాశమున్నా మీతో ఉన్న కూడా దిగలేదన్న. అన్నా అన్నా ఎప్పుడు అడగలేదన్నా.
జగనన్న : హాహాహా టైం లేదబ్బా ఇంటికి రా
నేను : అన్నా అన్నా నేను కేవలం మీ కోసమే వచ్చా అన్నా,లేదంటే ఇడుపులపాయ వెల్లేవాన్ని
జగనన్న : సరే త్వరగా రా అబ్బా బాగా మొండోడివే (కారు దిగుతూ)
నేను : నేను మీ అభిమానిని అన్న ఆ మాత్రం ఉంటుందన్నా
జగనన్న : హహాహా థ్యాంక్యూ చందూ ఉంటాను. (నా బుజం తడుతూ)
సెక్యురిటి : బాబు నువ్ సార్ ని కారు నుండి దింపావు అని అందరూ షేకాండ్,మంచి పాపులార్టీ పులివెందులలో
హోటల్ లో సినిమా చూడటానికి వెల్తే థియేటర్లో అందరూ పలకరించారు. చాలా సంతోషమేసింది.
ఇది జగనన్న మనస్తత్వం.

By
చందు,పెనుబల్లి మండలం , ఖమ్మం జిల్లా .

pLEASE EMAIL US FOR UPDATES AND CORRECTIONS – PUBLISH@MYDIGITALNEWS.IN , WHATSAPP 888 5555 924

Topics