BJP Competitive NEWS

నేను మోడికి ఎందుకు ఒటెయ్యాలి……..

ఇక నరేంద్ర మోదీ కథ. ఆయన బంధువులెవరు ? ప్రస్తుతం ఏం చేస్తున్నారు ? మొన్న ఇండియా టుడేలో వచ్చిన వ్యాసంలో వివరాలు చూద్దాం.

ఒక బాబాయి కొడుకు–అరవింద్‌ భాయ్‌–నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని–వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు.

అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్మి వాద్‌నగర్‌లో చిన్న గదిలో ఉంటాడు.

జయంతిలాల్‌ అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు.

అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు. వాద్‌ నగర్‌లో ఎవరికీ వీళ్లు నరేంద్రమోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు.

మోదీ అన్నయ్య–సోంభాయ్‌ (వయస్సు 75) పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు. ఒకానొక సభలో కార్యక్రమాన్ని నిర్వహించే అమ్మాయి ‘‘ఈయన నరేంద్రమోదీ అన్నగార’’ని నోరు జారింది. ఆయన మైకు అందుకున్నాడు. ‘నాకూ ప్రధాని మోదీకి మధ్య పెద్ద తెర ఉంది. మీకది కని పించదు. అవును, నేను నరేంద్రమోదీ అన్నయ్యని. ప్రధానికి కాను. ప్రధాని మోదీకి నేనూ 1.25 కోట్ల భారతీయుల వంటి సోదరుడిని’’ అన్నారు.

మోదీ అన్నయ్య అమృతాభాయ్‌(72) చెప్పాడు: 1969లో అహమ్మదాబాద్‌ గీతామందిర్‌ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్‌లో టీ దుకాణం నడిపే రోజుల్లో–ఆ దుకాణం నిజానికి వారి మేన మామది–మోదీ రోజంతా పనిచేసి–ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆఫీసుకి వెళ్లి వృదులైన ప్రచారక్‌లకు సేవ చేసి–ఏ రాత్రికో కొట్టుకే వచ్చి క్యాంటీన్‌ బల్లమీదే నిద్రపోయేవాడట–ఇల్లు ఒకే గది ఉన్న వసతి కనుక. 2003లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబంతో ఒకసారి మోదీ గడిపారట.

మరి 2012లో ఎందుకు మళ్లీ గడపలేదు ?
ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నాడుకదా ! అధికారంతో వారి బంధుత్వం వారి అమాయకమైన జీవనశైలిని కల్మషం చేస్తుందనీ ……
ఆనందకుమార్‌కీ, రాబర్ట్‌ వాద్రాకీ ఈ మాట చెప్పి చూడండి .

నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ …. కొందరికి అతి తక్కువమందికి–అవకాశం.సేవ . అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. నేను ప్రధాని గురించి మాట్లాడడం లేదు. సోంభాయ్‌ చెప్పిన ప్రధాన చౌకీదారు గురించి చెప్తున్నాను. నా అభిమాని నన్ను మరొక్కసారి క్షమించాలి. ఇక మన ప్రస్తుత రాజకీయ నాయకులు వారి కుటుంబ ఆస్తులు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ..RKR

ఇక ఓ అమెరికన్ చెప్పిన మాటలు మీకోసం ..

మీకు నచ్చినా, నచ్చకపోయినా భారతదేశంలో గ్రామీణ రంగం మోదీగారి వెనుక ఉంది.
వాళ్లని మీరు భక్తులన్నా, అనుచరులన్నా వాళ్లకి వెంట్రుక ఊడదు (ఇంతకన్న ముతక మాట అన్నాడు ఓ అమెరికన్). మొట్ట మొదటిసారిగా 4ఏళ్ల పాలనలో ఒక్క కుంభకోణమూ లేని పార్టీ నాయకుడు వారికి దక్కాడు. అనూహ్యమైన కుంభకోణాలతో మురిగిన దేశం ఒక ప్రధాని మూగతనాన్ని వేళాకోళం చేసే స్థాయికి చేరుకొన్న నేపథ్యంలో ఇది గొప్ప, వాంఛనీయమైన పరిణామం.

ముస్లింలు మోదీని ద్వేషించటం లేదు. ఇంకా చెప్పాలంటే ముస్లిం మహిళలు మోదీ వైపే. చదువుకున్న హిందూ మేధావులు ఆయన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో వారు అతి మెళకువగా, శ్రద్ధగా ప్రజాభిప్రాయాన్ని వంకర తోవ పట్టించడానికి చేసిన కృషిని ఆయన గంగలో కలిపాడు కనుక. సరదాగా టీ సేవిస్తూ పత్రికల్లో రాజకీయాలను చర్చించే ‘బాతాఖానీ’మేధావుల నడ్డి మీద ఆయన ఒక తాపు తన్నాడు కనుక.

నాకనిపిస్తుందీ …. చాలామంది భారతీయులు మోదీని వ్యతిరేకించడాన్ని ఒక స్టేటస్‌ సింబల్‌గా భావిస్తూ, తద్వారా తాము మేధావులం, మతాతీత శక్తులమని నిరూపించుకోజూస్తున్నారని.
వారికి అదొక ఫేషన్‌. ఒక్క ఉదాహరణ ఢిల్లీ ముఖ్యమంత్రి– కేజ్రీవాల్‌.

ఆయన మోదీ విద్యార్హతల్ని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయం సాధికారికంగా సమర్థించే సరికి పూర్తిగా జారిపోయాడు. ఇది అతి నీచమైన ‘spit and run-‘ రాజకీయం. ఇలా కక్కగా కక్కగా ఏదో మురికి ఆయనకు అంటుకోక మానదని కొందరి ఆశ.

దురదృష్టం … భారతీయ సైన్యం చేసిన దాడులనీ కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.
మాకు ట్రంపు ఉన్నాడు. అమెరికాని సమర్థించే ఆయన ఏ చర్యనయినా బొత్తిగా చదువురాని అమెరికన్‌ కూడా సమర్థించాడు.

మీ సైన్యం చర్యలనే భారతీయులు ఖండించే స్థితికి వస్తే– మీలో ఏదో సీరియస్‌ లోపం ఉన్నట్టే లెక్క.

ప్రపంచంలో ఇండియా ఇప్పుడిప్పుడే తనదైన స్థానంలో నిలదొక్కుకుంటోంది. ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకోవాలంటే గుజరాత్‌ టీకొట్టు మనిషే మీకు గట్టి దన్ను. రాహుల్‌ గాంధీ అనే ఆ శాల్తీని కాక ఈయన్ని మళ్లీ ఎన్నుకోడానికి మరో ఎన్నిక మీకు అవసరమనిపిస్తే మిమ్మల్ని ఆ దేవుడే రక్షించుగాక అంటున్న ఓ అమెరికన్ …….

ఏది ఏమైనా ..?
డియర్ మోడీజీ…!!
ఇంగ్లీష్ వారి నుండి పాలన మారిన తదుపరి సాగిన పలు దశాబ్దాల పాలనలలో వలెనే
మీరు కూడా లక్ష కోట్లో …..
పది లక్షల కోట్లో ….etc
వంతున మీరు మీవాళ్లు కలిసి
స్కాములు చేసుకుంటూ పోతూ ఉండి ఉంటే …….
దొరికినంత దోచుకొని పంచుకొంటూ
పోతూ ఉండి ఉంటే
మాకీ బాధ ఉండేది కాదు.
ఎందుకంటే అది మాకు 70 ఏళ్లుగా అలవాటైపోయింది ..
స్కాముల వల్ల అవినీతి వల్ల మా జేబుల్లో డబ్బులు డైరక్ట్ గా పోవు గదా ..?

మాకేమీ నేరుగా తెలియనివవి.

 భవిష్యత్ అంటే రాబోయే తరాలు అంటే మా పిల్లలు, మనవలు, ముని మనవలు ఎంత ఇబ్బంది పడితే మాత్రం మాకేమిటి..

మేము ఈ రోజుకి సుఖంగా ఉన్నామా లేదా అన్నదే మాకు ముఖ్యం.

అది మానేసి మీరిలా నల్లధనం నిర్మూలన ….. అవినీతిని అరికడతాను అంటే ఎలా చెప్పండి …..?

ఇదేమాట ఎన్నికల్లో చెబితే నమ్మి మీకు ఓటేశాం..
కాదనడంలేదు. అయితే మామూలుగా నాయకులు వాగ్దానాలు చేసి మర్చిపోతారు గదా .. కానీ
నిజంగానే అవినీతిపై యుద్ధం చేస్తానంటే ఎలా చెప్పండి ..?

మీకంటే పెళ్ళాం బిడ్డలు లేరు .. కుటుంబం, సంపాదన అనే లంపటాలు లేవు …

మరి మా సంగతి ..? ఏం .. దేశంలో జనమంతా సన్యాసులనుకున్నారా ? లేక మీలా నిబద్ధత గల ఆరెస్సెస్ ప్రచారక్ లు అని భావిస్తున్నారా ..?

దేశం అభివృద్ధి చెందితే మాకేమిటి ..?
చెందకుంటే మాకేమిటి ..?
అందుకోసం మమ్మల్ని 50 రోజులు ఇబ్బంది పెడతారా ..? మీ పాలన మాకేం నచ్చలేదు.

అవినీతి లేకుండా చేసేస్తే .. మాకు ఈజీ మనీ ఎలా వస్తుంది ..?

ఎన్నికల్లో ఓటుకి రెండు వేలు ఎవడిస్తాడు..?
మాకు ఎంత వస్తుంది అనేది మాకు ముఖ్యం కాదు.
అవినీతిలో భాగం కావడమే మాకు ప్రధానం.
మేమలానే రుచిమరిగి యున్నాము.

 • మేము ఏ సరుకులు కొన్నా బిల్లు అడగము తీసుకోము. అందువల్ల మాకు రూపాయి కలిసొచ్చినా చాలు .. ఆ అక్రమ వ్యాపారి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడతాడు అదే మాకు సంతోషం. అలాంటి అక్రమ వ్యాపారులు కోట్లు సంపాదించుకుంటే అదే మాకు పరవశం.
 • స్విస్ బ్యాంకులో డబ్బంతా తెచ్చి మాకు పంచేస్తాం అని చెప్పారు గదా అప్పట్లో … ముందు విమానంలో వెళ్లి ఆ డబ్బు కంటైనర్ లో తెచ్చి మాకు మనిషికి ఇంతని పంచేసి మాట నిలబెట్టుకోండి.

ఆ తర్వాత మీ పక్కన, మీ పార్లమెంట్లో, మీ ఢిల్లీ లో ఉన్న కుబేరులందరి డబ్బులూ లాగేసి అవి కూడా పంచేయండి.

ఆ తర్వాత మా దగ్గరికి రండి … అప్పటికి అన్నీ బాగుంటే .. మీరు, మేమూ ఉంటే .. అప్పుడు మా డబ్బులు మీకు లెక్క చెబుతాం . టాక్స్ కట్టాల్సి ఉంటే వాయిదాల్లో కడతాం ….. నో ప్రాబ్లమ్.

 • అయ్యా .. ఈలోగా మీకు మరీ ఖాళీగా ఉంటే ….. అంత తాపత్రయంగా ఉంటే ……
  అవినీతి పై పోరాటం పేరుతొ ఒక నెలరోజులు బందులు, హర్తాళ్లు చేయించండి ……
  మేము కూడా పాల్గొని మద్దతిస్తాం.
  షాపులు కట్టించేస్తాం .. ఇంకా అవసరం అయితే ప్రభుత్వ_వాహనాలు, బస్సులు, రైళ్లు కాల్చేస్తాం.
  పోలీసు కాల్పుల వరకూ తీసుకెళ్లి మీకు మంచి పేరు తెస్తాం.

ఏం ..భారత దేశంలో మీరొక్కరే తెలివైన వాళ్ళని మీ ఫీలింగా ..?
ఏం మాకు తెలియదా దొంగలు ఎవరో ..?
వాళ్ళు మా పక్కనే లేరా ..?
ఏదో అందరం అలా కలిసిమెలిసి బతుకేస్తున్నామ్ డెబ్బదేళ్ళుగా….. ఇంతకాలంగా…..!!

“దేశ” ప్రయోజనాల పేరుతొ మా మధ్య విభేదాలు తెస్తారా ..? మీ తీరు అస్సలు నచ్చడం లేదు.

మాకు మన సైనికులు చచ్చిపోయినా దేశం నాశనమయ్యినా మాకు సంతోషమే గానీ .. మీకు పేరొస్తే ఎలా సహిస్తాం ..? చెప్పండి ?
మిగిలిన భ్రష్టాచార నేతలు వారి పార్టీలు, వారి కుటుంబ రాజకీయ వ్యాపారాలు బడవాల మనుగడేంకాను ……?

sorces link :- https://www.facebook.com/unitehindus/posts/2238521043037928

Please email us for updates and corrections, publish@mydigitalnews.in ,

 

Topics