Competitive NEWS

ఆ పంచాయితీలో అంతా ప్రత్యేకమే

అంబాజీపేట : అది పుల్లేటుకుర్రు గ్రామ పంచాయతీ. జిల్లాలో సంసద్ గ్రామయోజన పంచాయితీలలో ఇదొకటి. అక్కడంతా ప్రత్యేకమని చెప్పాలి. ఈ సాగి గ్రామ పంచాయతీ అభివృద్ధికి చిరునామా కూడా. జిల్లాలో ఏ పథకం చేపట్టిన ఈ సాగి గ్రామ పంచాయతీని పైలట్ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయబడుతుంది. ఈ పంచాయతీ అభివృద్ధికి చిరునామా అని కూడా చెప్పచు. సర్పంచులు పదవీకాలం పూర్తి అవ్వడంతో, ఈ మద్యనే పుల్లేటికుర్రు ప్రత్యేక అదికారి పాలనలోకి వచ్చింది. అంబాజీపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఇక్కడ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, 72వ స్వతంత్ర దినోత్సవ పురష్కారంచుకొని ఒక ప్రత్యేకత చోటుచేసుకోవడం విశేషం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగరవేయవలసి ఉంది.

దానికనుగుణంగా అధికారులు అంతా సిద్దం చేసారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎడతెరపని వర్షం వలన జాతీయ జెండా తడిసి ముద్దయితే అవమానమని అధికారులు అనుకున్నారో ఏమో, జెండాకు రక్షణగా వర్షానికి తడవకుండా గొడుగును ఏర్పాటు చేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పుల్లేటికుర్రు గ్రామపంచాయతీ ప్రధాన రహదారికి అనుకోని ఉంది నిత్యం జనాలతో రద్దీగా ఉండడం వలన జాతీయ జెండాకు రక్షణ కవచంగా ఏర్పాటు చేసిన గొడుగు చూపరులను విశేషంగా ఆకట్టుకొంది. కొసమెరుపేంటంటే “జండా ఊంచా రహే హమారా అని నానుడి ఉంది. జెండా స్థానం ఎప్పటికి పైనే ఉంచాలి, కానీ ఇక్కడ గొడుగు పైన ఉండడంతో గ్రామ పంచాయతీ ప్రత్యేక అదికారి మండల పరిషత్ అభివృద్ధి అదికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ని ఈ విషయంపై వివరణ కోరగా జాతీయ జెండా గౌరవ కోడ్ ప్రకారం త్రివర్ణ పథకం తడవ కూడదని, జాతీయ జండాకు గౌరవం ఇవ్వడమే ప్రదాన అంశంగా పరిగణించాలని అన్నారు. ఈ విషయంలో తప్పొప్పులు ఎలాగున్నా, జాతీయ జండా వర్షానికి తడవకుండా రక్షణ కవచంగా గొడుగు ఏర్పాటు చేయడంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ విశ్వనాధ్ తీసుకున్న  సమయస్పూర్తి నిర్ణయానికి ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చింది.

By- తూతిక శ్రీనివాస విశ్వనాధ్
మండల పరిషద్ అభివృద్ధి అధికారి
అంబాజీపేట,
ప్రత్యేక అధికారి, పుల్లేటికుర్రు గ్రామ పంచాయతీ
7675924666

PLease email us for updates and corrections, publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics