Competitive NEWS quotes

ఏముంది 72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం – నా దేశం లో ?

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

వ్యక్తి ఆధిక్య పోరులో కులాల , మతాల మధ్య చిచ్చులు ఆగ నే  లేదు

  72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

ఇంకా వ్యభిచార గృహాల్లో మగ్గి పోతున్న స్త్రీలు

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

ప్రజలు   మద్యం మత్తులో నే ఉన్నారు

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

ఇప్పటికీ కుల మత భేదాలతో మానసికంగా దూరం అవుతూనే ఉన్నారు , కానీ నైతికంగా ఒకరి మీద ఒకరు ఆధార పడి బతుకుతున్నారు

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

ప్రభుత్వ ఆదాయంలో అధికశాతం  మద్యం ద్వారానే వస్తున్నది

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం   

ఆవు ఎండకి వానకి నది రోడ్డు మీద కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరక్క ఆకలికి చెత్తకుండీలలో కుళ్ళి పోయినవి  తింటుంటాయి,

ఆవు  నడ్డి  కడిగి పూజ చేస్తారు కానీ కనీసం ఒక్క పూట  దానికి కడుపు నిండా సరిపడా ఆహారం  (గడ్డి ) పెట్టరు. కానీ మనకు మాత్రం అది గోమాత మనకు వరాలు ఇవ్వాలి , ధన కానక వాస్తు వాహనాదులు ఇవ్వాలి ,

మనకు మన కింద పనిచేసే తోటి వాడు మనకి సరియైన గౌరవం , ఇంకా మనకు పనిలో ఇబంది కలిగినప్పుడు వాడు మనకు ఎలా సహాయం చేసాడు అన్న విషయాలు గుర్తుంచుకుని మాత్రమే మనం వాడికి జీతం ఇస్తాము, మరి గో మాత ,

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

స్త్రీలు ఇంకా బానిసత్వానికి, అణచివేతకు గురి అవుతూనే వున్నారు

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

ఇప్పటికి ఇప్పుడు బయట ఎవరైనా 8-10 తరగతుల స్టూడెంట్స్ కనిపిస్తేయ్ ఒక్కసారి అడగండి , “స్వతంత్ర సమరయోధులు” అంటే ఎవరు అని , ఎంత మంది మీకు సమాధానం చెబుతారు ?

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

ఇంకా బిచ్చగాళ్ళు ఉన్న అభివృద్ధి చెందిన దేశం నా దేశం భారత దేశం,

200 సంవత్సరాల క్రితం ఒక్క బిచ్చగాడు కూడా లేని నాదేశం,బిచ్చగాడిని అతిధి (దైవంగా) సంభోదించి మర్యాదలు చేసి భోజనం పెట్టి పంపే దేశం నా దేశం భారత దేశం

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

నా చిన్నవయసులో స్కూల్ లో – టీచర్ మీరు పేదైయ్యాక ఏమవుదామనుకుంటున్నారు అని అడిగితే

నేను పోలీస్ -15/60,నేను ఆర్మీ 10/60 అని చేతులెత్తే వారు,

కానీ ఇప్పుడు 2/60 ఇక కొన్ని స్కూల్స్ -0/60, చేతులు పైకి లెగుస్తున్నాయి ,

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

విద్యలో ప్రాక్టీకల్స్ కి 30 శాతం వరకు ప్రాధాన్యం ఇచ్చారు, కానీ కనీసం 30 శాతం విద్యాలయాలలో కూడా సరైన ప్రాక్టికల్స్ నేర్పించేవారు లేరు,

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

పోలీస్ మనకు ఒక 100 ఫైన్ రాస్తే – పోలీస్ వాడు దొండ చీటర్ , కరప్టెడ్ , నీచం చెండాలం,ఇలా ఇలా ఇంకా ఎన్నెన్నో అంతం , కానీ మనలో ఎంతమంది నిజాయితీగా మన రూల్స్ మనం పాటిస్తున్నాం,సరే ఆ పోలీస్ కొద్ది సేపు లేడనుకుందాం తీసేశారనుకుందాం  – మరి తరువాత ఏం జరుగుది అంటే ?? ఎంత మంది ఇల్లు ఎంత మంది ఆక్ర మించుకుంటారో , ఎంత మంది నిద్ర పోతారో ,యెంత మంది కుటుంభం తో ఉంటారో ??

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

ప్రకృతిలో దొరికే అతి సాధారణ మైన వనరులను  కూడా మనం అమ్ముకు బతికే స్థాయిలో ఉన్నాము, నీళ్లను కూడా మన పక్కనోడికి ఫ్రీ గా ఇచ్చే పరిస్థితి లో లేము

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

బహిరంగంగా మత విద్వేషాల తో వర్గ విద్వేషాలతో సాటి ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నా మన చట్టాలు ఏమి చేస్తున్నాయి.

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

1947 సంవత్సరం లో 1 రూపాయి – 1 డాలర్ తో సమానం గా  ఉండేది , మరి ఇవ్వాళా ఎంత ఉందొ మీరే చుడండి 1Rs = 0.014 డాలర్ ; అంటే 70.5 రూపాయలు.

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

నా దేశం లో సైనికులకు రాను రాను విలువ తగ్గుతోందని చెప్పాలో లేక ఏమి అనాలో తెలియని పరిస్థితి

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

నిజమైన మీడియా లేదు లేదు అంటారు, కానీ నిజమైన మీడియా వచ్చి నిజాలను మాత్రమే చూపిస్తుంటే ఎవరూ చూడరు, చదవరు, కనీసం  అండ్ షేర్ కూడా చెయ్యరు .

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

అవినీతి లో నా దేశం కి 81 వ స్థానం కలిగించిన నా దేశ ప్రజలు (సిపిఐ ఇండెక్స్ అఫ్ 180 కింట్రిస్ )

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం 

90/100 వచ్చిన వాడికి ప్రభుత్వ ఉద్యోగం లేదు , కానీ 45 వచ్చినవాడికి ఉంది,

72  సంవత్సరాల స్వతంత్ర భారతదేశం —నా దేశం  లో ఇంకా ఎన్నో ఎన్నెన్నో , సమయం చాలదు ,రాయటానికీ, చదవటానికి, ఇంకా పేజీ లలో కాళీ కూడా సరి పోదు ,

ఇది నిష్కళంక దేశ భక్తుని ఆవేదన – ఇది కేవలం నా భావ ప్రకటన మాత్రమే ,  నా దేశం లో ఇంకా నాకు భావ ప్రకటన హక్కు ఉంది అనే అనుకుంటున్నాను ,

Santhosh kumar Athaluri – Founder MDN NEWS

Topics