NEWS

అమర్ రహే అటల్ జీ అమర్ రహే – పాటిబండ్ల

అమర్ రహే అటల్ జీ అమర్ రహే – అంటూ శ్రీ అటల్ బిహారీ వాజపాయి గారికి ని వాళులు అర్పిస్తున్న శ్రీ పాటిబండ్ల రామ కృష్ణ గారు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కన్నుమూత…దిగ్భ్రాంతిలో పార్టీ శ్రేణులు….

అటల్ బిహారీ వాజపేయి (జ. డిసెంబర్ 25 1924) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండవ లోక్ సభకు ఎన్నికైనారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్ సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్ సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు.

అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాలవల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం డిసెంబర్ 24 , 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.

ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను

సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వాజ్పేయీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ భారతరత్న ‘ 2015 మార్చి 27 న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్పేయీకి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజ్పేయీ నివాసానికి తరలి వచ్చారు….

please email us for updatesa and corrections, – publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924 ,

Topics