Competitive

సొంత ఇల్లు లేని ఓ భారత రత్న కథ- సంతోష్ కుమార్ అత్తలూరి

సాధారణ ఎమ్మెల్యే.. ఎంపీ లు సైతం కోట్లకు పడగలెత్తే ఈ దేశంలో, దేశ ప్రధాని.. సొంత ఇల్లు లేని ఓ భారత రత్న కథ:

94 ఏళ్ల, సిసలైన భారత రత్న.. ఆరోగ్యం కుదుట పడితే రండి, ఆరోగ్యం సహకరించకుంటే, వాజపేయి గారు మీరు  అలా సాగిపోండి.

మీరు ప్రాణం పెట్టి వేసిన విత్తనాలు పళ్ళ మొక్కలయ్యి,
దేశ వృక్షం అయ్యింది, అంటూ ఆనందిస్తూ హాయిగా సాగిపోండి

అప్పట్లో మీకు మీ తోటి వారికి జరిగే అవమానాలు చూస్తూ..
2 సీట్ల నుండి 22 రాష్ట్రల పార్టీ గా మారిన తీరు చూస్తూ..
అలా సాగిపోండి.

మైనార్టీ.. కుల రాజకీయ సమీకరణాలని పెట్టుబడిగా, మత విద్వేషాన్ని రాబడి గా భావించే నపుంసకుల క్షోభ మధ్య నుండి సబ్ కా సాత్ సబ్కా వికాస్ అన్న మాటలు వింటూ..దేశములో ఒక్క తీవ్రవాద దాడి జరగకుండా చేసిన మీ శిష్యులు భారత దేశం విశ్వవిజేత గా మీరు వేసిన బాటలు చూస్తూ.. అలా సాగిపోండి.

ఒక్క ఓటు తగ్గితే రాజీనామా చేసిన మీరు, రాజకీయ సమీకరణాల్ని ఎలా వేయాలో అధికారం కోసం అడ్డమైన గడ్డి కరుస్తున్న వెధవలని ఎలా తొక్కి పెట్టి తొక్క తీయాలో చేసి చూపిస్తన్న మీ శిష్యుల్ని చూస్తూ  అలా సాగిపోండి.

మిత్ర ధర్మం కోసం శత్రువులని పెంచుకున్న మీరు, శత్రు శేషం రుణ శేషం మిగల్చని..మీ శిష్యుల్ని చూస్తూ  అలా సాగిపోండి.

ఇటుక ఇటుక గా కట్టుకున్న మీద పొదరిల్లు, అఖండ భారత నందన వనంగా మార్చిన .మీ శిష్యుల్ని చూస్తూ  అలా సాగిపోండి.

యావత్ దేశాన్ని కలుపుతూ.. కశ్మీర్ నుండి కన్యా కుమారి వరకూ మీరు వేసిన హై వే లు చూస్తూ.. ప్రస్తుత GST.. మరింతగా కలిపింది, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా త్వరలోనే, అది చూస్తూ  అలా సాగిపోండి.

70 ఏళ్లలో లేనిది 7 రోజుల్లో..7వారాల్లో..7 నెలల్లో నే కావాలనే నపుంస’కులను తప్పించుకుని.. అలా సాగిపోండి.

ప్రోక్రాన్.. ఇస్రో లో మీరు వేసిన బాటలు.. యుద్ధ సమయంలో మీరు చేసిన ప్రసంగాలు చూస్తూ… అలా సాగిపోండి.

మీరు జన నాయకులు..
జనం నుంచి పుట్టిన నాయకులు..
జనం కోసం బతికిన నాయకులు…
జనం కోసం ఉన్న నాయకులు….
జనంతోనే ఉన్న నాయకులు…
ప్రజాస్వామ్యం లో..
ప్రజలే నాయకులు అని నమ్మిన నాయకులు

నేటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కుటుంబ రాజకీయ పార్టీల ని దేశంలో ఉన్న విదేశీ వెధవల్ని చూసి క్షోభ పడే కంటే సాగిపోండి..అలా..

దొంగ గాంధీలు గలీజు గార్లు దేశాన్ని ఇంకా ఏలేద్దాం అనుకుంటున్న సమయంలో మీ పార్టీ కుల కుటుంబ పార్టీ కాదు… ఒక సామాన్యుడు కూడ మంత్రి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ కూడా కావచ్చు అని నిరూపించారు..

భారత్ ఏక్ తుక్డ నహిహై.
జీతాజగతా రాష్ట్ర పురుష్ హై.
ఏ వందన్ కీ దర్తి హై.
అభినందన్ కీ దర్తి హై.
ఏ అర్పన్ కీ భూమి హై.
ఏ తర్పన్ కీ భూమి హై.
ఇస్ కీ నది నది హమారే లియే గంగా హై.
కంకడ్ కంకడ్ హమారే లియే శంకర్ హై.
జీయే0గే భారత్ కే లియే.
మరే0గే భారత్ కే లియే.
మరనేకే బాద్బీ….గంగా జల్మే బెహ్తీహుయి ఆస్తికోకో కోయీ ఖాన్ లాగేకి సునాగతో ఏకీ అవాజ్ ఆయెగి ఓహై#భారత్_మాతకి_జై..! అన్న మీ మాటలు..

ఒకప్పటి శివాజీ.. రాణా..బోస్..భగత్..అస్ఫాతుల్లా..సుఖ్దేవ్.. అల్లూరి..ఇక ఇప్పుడు.. మీరు.. మీ లాంటి నాయకులు ఎక్కడ ఉంటె అది స్వర్గం…స్పృహలోకి కూడా రాకుండా అలా సాగిపోండి. సాగిపో నేతా ! అభినవ జాతి పిత..!

సాధారణ ఎమ్మెల్యే.. ఎంపీ లు సైతం కోట్లకు పడగలెత్తే ఈ దేశంలో, దేశ ప్రధాని.. సొంత ఇల్లు లేని ఓ భారత రత్న..ను అందించిన భారత్ మాతా కి జై..జై హింద్..

Please email us for updates and corrections, – publish@mydigitalnews.in, WhatsApp 888 5555 924

Topics