Fashion quotes

అది ఆత్మీయ రాఖీ అనుబంధం

గొల్లప్రోలు : అతడు ఒక మండలస్థాయి అధికారి పేరు తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ప్రస్తుతం అంబాజీపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా సేవలందిస్తున్నారు. ఆమె నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యంగురాలు పుట్టుకతోనే పోలియో బారినపడి రెండు కాళ్లు పనిచేయక ఇంటికే పరిమితమయ్యింది.

పేరు మొగలి కనకమహాలక్ష్మి గొల్లప్రోలు పట్టణ వాస్తవ్యురాలు. వీరిరువురు మధ్యన చిగురించిన అన్న చెల్లిల అనుబంధం రక్తసంబంధం కన్నా గొప్పదని స్థానికులే చెప్పుకోవడం విశేషం. వివరాల్లోకి వెళ్తే ఎంపీడీఓ విశ్వనాధ్ ఎనిమిది సంవత్సరాల క్రితం పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా సేవలందించారు. విశ్వనాధ్ తన సేవాకాలంలో ఈ ప్రాంత ప్రజలతో మమేకమై ఎన్నో సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందారు. సమస్యలు ఎక్కడుంటే విశ్వనాధ్ అక్కడుంటారని మండల ప్రజలు ఇప్పటికి విశ్వనాధ్ సేవలను గుర్తు చేసుకుంటూ వుంటారు. ఎంపీడీఓకి ఉన్న ఎంతోమంది అభిమానులలో దివ్యంగురాలైనా మొగలి కనకమహాలక్ష్మి ఒకరు. దివ్యంగులు పొందాల్సిన రాయితీ రుణాల కోసం ఎన్నోసార్లు మండల కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే రాయితీ రుణాలపై దాదాపు ఆశలు వదులుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే విశ్వనాధ్ 2012లో గొల్లప్రోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా భాద్యతలు చేపట్టిన తర్వాత సహాయం కోసం మండల కార్యాలయానికి వచ్చిన కనకమహాలక్ష్మిని ఎంపీడీఓ ఆదరించి రాయితీ రుణం మంజూరు చేయడం జరిగింది. తనను ఆదరించిన విశ్వనాధ్ ను తన అన్నగా పరిగణించి ప్రతి రాఖీ పౌర్ణమి నాడు రక్షా బంధన్ రాఖి కట్టి తన ఆత్మీయతను చాటాలని మహాలక్ష్మి నిశ్చయించుకుంది. అలాగే ఎంపీడీఓ విశ్వనాధ్ కూడా తాను ఎక్కడున్నా రాఖీ పౌర్ణమి వచ్చిందంటే తప్పనిసరిగా గోల్ల్లప్రోలు వచ్చి కనకమహాలక్ష్మి చేత రాఖీ కట్టించుకొని తన అనుబంధాన్ని చాటుకోవడం ఆనవాయితీగా మారింది. గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంపీడీఓ విశ్వనాధ్ కనకమహాలక్ష్మి క్రమం తప్పకుండ తమ మధ్య ఉన్న అన్న చెల్లి అనుబంధాన్ని ఇదిగో ఈ విధంగా రాఖీబంధంతో చాటుకోవడం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది.

Topics