AP politics BJP

కొలంబస్ లో కన్నా & తాళ్ళ

అమెరికాలోని  కొలంబస్  లో OFBJP ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది, మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ అన్నయ్య ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు,

ఈ సందర్బంగా రాష్ట్ర అధినేత కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ కొలంబస్ లో OFBJP మీటింగ్ లో పలు విషయాలు పై స్పష్టత ఇచ్చారు,

ప్రధానంగా బీజేపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్ట్స్, పథకాలు, ప్రత్యేక హోదా పై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న అబద్ధాల ప్రచారంపై చంద్రబాబు యు టర్న్ , అవినీతిపై అమెరికా OFBJP కి దిశ నిర్దేశం, చేస్తూ కొన్ని సూచనలు చేశారు,ప్రధానంగా హోదా పై చంద్రబాబునాయుడు ఒప్పుకున్న విషయం హోదా వద్దు ప్యాకేజి చాలా బెనిఫిట్ అని 16-09-2016వ తేదీన రాత్రి 11 గంటల వరకు వెంకయ్యనాయుడు గారి సమక్షంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో అధికారికంగా ఒప్పుకున్న ఈ చంద్రబాబునాయుడు,

జరిగిన 4సంవత్సరాల నుండి హోదా వద్దు ప్యాకేజి ముద్దు అని కేంద్రం దగ్గర ఒప్పుకొని, ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని ఆంద్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా సన్మానాలు, సత్కారాలు, , చేసి , హోదా గురించి మాట్లాడిన వారిని అరెస్టులు కూడా చేయించిన ఘనత ఈ అబద్ధాల చంద్రబాబు ది, ప్రతి పక్షంలో ఉన్న వై.సి.పి నేత జగన్మోహనరెడ్డి హోదా -అని ధర్నా చేస్తుంటే ఎగతాళి చేసిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి , సినిమా వాళ్ళను పోలీసుల చేత లాఠీచార్జి చేసిన ఘనుడు, ఈశాన్య రాష్ట్రాలకు హోదా ఇచ్చినప్పటికి పెద్దగా ఒరిగింది ఏమి లేదు అని చెప్పారు, అన్ని ప్రముఖ పత్రికల్లో టి.వి.ల్లో వచ్చింది, హోదా అంటే కేవలం తాళి కట్టి వదిలివేయడం లాంటిది అని, కేవలం 30శాతం మాత్రమే అదనంగా బెనిఫిట్ అని  అంతకుమించి కేంద్రం సహాయం చేసిందని చెప్పారు,

బీజేపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర _కార్యదర్శి ** తాళ్ల వెంకటేష్ యాదవ్**_ మాట్లాడుతూ

బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీ గొప్పదనం , కేంద్రంలో అధికారంలో ఉండి దేశానికి చేసిన సంస్కరణలు, వీటన్నింటి మీద OFBJP కి వివారించారు, హోదా గురించి చంద్రబాబు విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని, ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు యు టర్న్ తీసుకొని ఇలా రక రకాలుగా ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇన్ని అబద్దాలు, మాటమార్చే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడా లేరూ అని, వై.సి.పి పన్నిన , పద్మ వ్యూహంలో చక్రంలో ఇరోక్కిని , ఏమి మాట్లాడుతున్నాడో చంద్రబాబు కె తెలియడం లేదని అన్నారు,

ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు, అధ్యక్షుల వారి తో కలిపి అమెరికా బీజేపీ టూర్ మొత్తం తాళ్ల వెంకటేష్ యాదవ్ గారు కో-ఆర్డినేషన్ తో విజయవంతంగా జరుగుతుంది, అధ్యక్షుల వారికి వెన్నంటి ఉండి నిరంతరం , పట్టు సడలని ఓర్పు , పట్టుదలతో, పక్క ప్రణాళికతో వెంకటేష్ యాదవ్ గారు, అధ్యక్షుల వారికి పూర్తి సహకారం అందిస్తూన్నారు,
తదుపరి టూర్ వివరములు వెంకటేష్ యాదవ్ గారు వెల్లడించారు.

న్యూజర్సీ , న్యూయార్క్, పిట్స్ బర్గ్, బ్లాటిమోర్, వాషింగ్టన్ డి.సి. ఈ రాష్ట్రాలన్ని బీజేపీ మీటింగ్స్ జరుగును.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న OFBJP నాయకులు శ్రీనివాస్ బొడ్డు, కొంపల్లి శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్ శ్యాం, నీరజ్ ఆంటోనీ (ఒహియో స్టేట్ రెప్రెసెంటిటివ్) , తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,

Please email us for updates and corrections, – publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics