NEWS

నా పగ వానికి కూడా నీ కష్టం రాకూడదు – చందు

మీ అన్యోన్యమైన దాంపత్యం చూసి ఆ దేవుడు కూడా ఈర్ష్య పడ్డాడేమో అనిపిస్తుంది. ప్రణయ్ లాంటి మంచి మనస్సున్న భర్త నీ జీవితంలోకి రావడం ఎంత అదృష్టమో, అంత దురదృష్టం అమృత. నిన్ను ప్రాణంగా ప్రేమించానంటున్న మీ నాన్న! నువ్వు ప్రాణంగా ప్రేమించిన, నీ ఆరో ప్రాణమైన, నువ్వే తన సర్వస్వం అనుకున్న నీ ప్రణయ్ నీ నీకు కాకుండా చేసి, నిన్ను 22 ఏళ్ళకే విధవరాలిని,నీ గర్భంలో ఉన్న నెత్తుటిముద్ద(ప్రణయ్) కి తండ్రి పేరు కూడా తెలియకుండా చేసేంత ప్రేమ మీ నాన్న సొంతం !! నీవెప్పటకీ నీ ప్రణయ్ సొంతమే !! నీ ప్రణయ్ ఎప్పుడూ నీవశమే!!!

ప్రణయ్ నీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని, మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
నీకు వచ్చిన ఈ బాధ మరే చెల్లికీ రాకూడదని ఆశిస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో ఓ అన్నయ్య.

చందు,
విజయవాడ +91 9502434151

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924,
Support or Donate to this Portal/Channel – Click here to donate,or copy and paste this link for bank details, http://www.mydigitalnews.in/donate/

Topics