NEWS

చింతమనేని పై కేసు నమోదు – ప్రజా సంఘాల విజయం

హమాలీ కార్మికుడి పై దాడి చేసిన ఘటన పై స్థానిక దెందులూరు MLA  శ్రీ చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు చేయడం ,కార్మిక ప్రజా సంఘాల విజయమని పలువురు వ్యాఖ్యానించారు .

రోజురోజుకు పెరిగిపోతున్న ఆగడాలను అరికట్టాలంటే చింతమనేని పై SC -ST అట్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని , కార్మికులకు న్యాయం చేయాలని గత 12 రోజులుగా వివిధ రాజకీయ ,కార్మిక, దళిత ,ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే , దశలవారీగా ఉద్యమమ్ సాగిస్తున్నారు .
ఉద్యమం మరింత ఉద్రిక్తమ్ అవుతుందని గ్రహించిన అధికారులు చివరకు FIR  నమోదు చేశారని వివిధ సంఘాల నాయకులు స్ప్రష్టం చేశారు . ఇంతటి తో ఆగకుండా చింతమనేని ని మరియు అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు .

చింతమనేనిని అరెస్టు చేసేవరకు ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు. నిరాహారదీక్షలు రెండవ రోజున iftu జిల్లా సహాయ కార్యదర్శి బద్ద వెంకట్రావు ,    సిపిఎం  నాయకులు జి. నరసింహారావు , సిపిఐ  నాయకులు బండి వెంకటేశ్వరరావు , పౌర హక్కుల సంఘం  జిల్లా కార్యదర్శి కే.వి.రత్నం ,బి సి హక్కుల వేదిక  నాయకులు  పి ఆదిశేషు , పి డి యస్ యూ  నాయకులు కే .నాని ,బి . వినోద్ ,తదితరులు శిబిరాన్ని సందర్శించి ఉద్యమానికి మద్దతు తెలియజేసారు . ఏ .పి మహిళా  సమాఖ్య నాయకురాలు ఎన్  విజయ హాజరై మద్దతు తెలిపారు .

బద్ద వెంకట్రావు- నగర  సహాయ కార్యదర్శి – ఐ . ఎఫ్ .టి.యు

PLease email us for updates and corrections – publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924,

Topics