NEWS

సియం ప్రకటించిన చేనేత వరాలకు జీవో విడుదల చేయాలి

గన్నవరం : రాష్ట్ర జనాభాలో అదిక సంఖ్యలో ఉన్న చేనేత వర్గాన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తే రానున్న ఎన్నికలలో బారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు హెచ్చరించారు. రాష్ట్రంలో 35 అసెంబ్లీ నియోజకవర్గాలలో నేతల తలరాతలు నిర్ణయించే శక్తి చేనేత వర్గానికుందని తమకు న్యాయం చేసే పార్టీలకె తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.

చేనేత అంటే దేశ వారసత్వ సంపదని, స్వతంత్ర స్పూర్తి నినాదమని, నైపుణ్యం ఉన్నవారే ఈ రంగంలో రానించగలరని కాని రెండు దశాబ్దాలుగా పాలకుల నిర్లక్షం వలన నైపుణ్యం ఉన్న నేతన్నలు అసంఘటిత రంగంవైపు వలసలు వెళ్ళిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాదాకరమని సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్రప్రభుత్వం చేనేత రంగంపై జియస్టీ విదించి నేతన్నల నడ్డు విరుస్తే రాష్ట్ర ప్రభుత్వం చేనేత బడ్జట్ లో కోతలు విదించి చేనేత రంగాన్ని అంపశయ్యపైకి నెట్టిందని కార్యవర్గ సభ్యులు ఆరోపించారు.

అన్ని రంగాలలో అభివృద్ది సూచిక పెరిగినా ప్రత్యక్షంగా మూడు లక్షల మంది, పరోక్షంగా 15 లక్షల మందికి ఉపాది కల్గించే చేనేత రంగం ఎందు కుటుపడిందో సమాదానం చెప్పాలని పాలకులను నిలదీశారు. రాష్ట్ర జనాబాలో 75 లక్షల మంది చేనేతవర్గానికి చెందినవారున్నా చట్టసభలలో తమ వాణి వినిపించడానికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చేనని సభ్యులు అభిప్రాయ వ్యక్తం చేసారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల వైఖరిని తప్పు పట్టారు. శాంతి కాములుగా పేరున్న చేనేత వర్గీయులను తమ హక్కుల కోసం రోడెక్కె ఉద్యమించే పరిస్థితి తీసుకురావద్దని హితవుపలికారు. రానున్న ఎన్నికలలో 15 అసంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలను రాజకీయ పార్టీలు చేనేతవర్గానికి కేటాయించాలని డిమాండ్ చేసారు. ఈ విషయంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను కలవనున్నామని అన్నారు. రాజకీయ పార్టీలకు చేనేత రంగం సమస్యలపై అవగాహన లేనందున పార్టీలు తయారు చేసే మేనిఫెస్టోలో లోపాల వలన చేనేత రంగం అభివృద్ధి స్పూర్తి లోపిస్తుందని ఇకపై “మా మేనిఫెస్టో మా భాద్యత” అనే నినాదంతో రాష్ట్ర దేవాంగ సఃఘః ఆద్వర్యంలో నిపుణుల కమిటీ వేసి చేనేత మేనిఫెస్టో తయారు చేసి అమలు కోసం అన్ని రాజకీయ పార్టీలకు పంపనున్నమని అన్నారు. హక్కుల సాదన విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని గుర్తుచేస్తు జాతీయ చేనేత దినోత్సవం నాడు చీరాల చేనేత సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన చేనేత వరాలకు తక్షణమే జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. సమావేశానికి నక్కిన చినవెంకట్రాయుడు అద్యక్షత వహించగా, సమావేశంలో రాష్ట్ర గౌరవ అద్యక్షుడు బొమ్మన రాజ్ కుమార్, ప్రదాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, అసోషియోటడ్ అద్యక్షులు తూతిక అప్పాజీ, రాయలసీమ అద్యక్షులు డికె నాగరాజ్, పుచ్చల రామకృష్ణ, ఆప్కో డైరెక్టర్లు ముప్పన వీర్రాజు, దొందంశెట్టి సత్యనారాయణ, ఆకాశపు స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంఘం నూతనంగా పదవీ భాద్యతలు చేపట్టి బీసి కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అద్యక్షులు బొడ్డు వేణుగోపాలరావును ఘనంగా సత్కరించింది

దన్యవాదములు

తూతిక శ్రీనివాస విశ్వనాథ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, 7675924666

Please email us for updates and corrections, publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924,
Support or Donate to this Portal/Channel –  Click here  tdonate,or copy and paste this link for bank details, http://www.mydigitalnews.in/donate/

Topics