NEWS

మల మూత్రాల విసర్జన శాలకు కూడా నోచుకోని GMC – సిబ్భంది –నమ్రత్

స్థానిక : గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో శ్రీ పి . నమ్రత కుమార్ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తో జీఎంసీ లో సిబ్భంది కష్టాలను వివరిస్తూ పై అధికారులను కనీస మౌళిక సదుపాయాలు కల్పించమని పత్రికా మరియు  ప్రసార మాధ్యమాల ధ్వారా పై అధికారులను కోరారు.

ఈ సందర్భంగా  శ్రీ పి . నమ్రత కుమార్ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తో మాట్లాడుతూ.

 

స్వచ్ఛ భారత్ గుంటూరు లో ఉంది ,గుంటూరు నగరం లో ఉంది , ప్రతి చోట వుంది ,ఇంకా  అంతకుమించి   ODF (బహిరంగ మల మూత్ర విసర్జన రహిత )  అవార్డు గుంటూరు కి వచ్చింది ,

కానీ GMC ఆఫీస్ లో పని చేసే వారికి మాత్రం ( ముఖ్యంగా) స్త్రీ లకు మలమూత్ర విసర్జన శాలలు లేవు ( NO Toilets ),

అయ్యా మెము ఏమి తప్పులను ఎత్తి చూపటం లేదు, గొడవ చేయటం లేదు,, మేము జస్ట్ టాయిలెట్స్ ఏర్పాటు చేయండి – చేయించండి అని అడుగుతున్నాం .

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉద్యోగుల వాహనాలు దొంగిలించి బడుతున్నాయి , ఈ దుస్థితికి కారణం కేవలం సరియైన పార్కింగ్ వ్యవస్థ లేక పోవటం మాత్రమే, జీఎంసీ లో పార్కింగ్ ప్లేస్ వుంది కానీ దానికి సరియైన నియంత్రణ లేదు ,

సిబ్భంధికి కనీస మౌలిక సదుపాయాలు లేవు ,వాటి పై ద్రుష్టి సారించండి,

Jaya Krishna – MDN NEWS

 

Please email us for updates and corrections – Publish@mydigitalnews.in, Whatsapp 888 5555 924

Topics