NEWS

చట్టాలపై అవగాహనతో సత్వర న్యాయం. ఎంపీడీఓ విశ్వనాధ్

అంబాజీపేట : ప్రజలకు చట్టాలపై అవగాహనా ఉండాలని, చట్టాలపై అవగాహనతోనే సత్వర న్యాయం జరుగుతుందని అంబాజీపేట మండల పరిషద్ అభివృద్ధి అధికారి, మాచవరం ప్రత్యేక అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. కాకినాడ రాజీవ్ గాంధీ న్యాయ కళాశాల అధ్యాపక బృందం గురువారం నిర్వహించిన న్యాయ విజ్ణాన సదస్సులో అయన మాట్లాడారు. దేశంలో 85 శాతం ఆర్ధిక వనరులు కేవలం 15 శాతం మంది గుప్పెట్లో ఉండడం వాళ్ళ ధనికులు, పేదల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని, పరిపాల వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య సమన్వయంతో ఈ పరిస్థితిని అధిగమించాలని సూచించారు. పరిపాలన వ్యవస్థకు, శాసన వ్యవస్థకు ‘వాచ్ డాగ్’ న్యాయ వ్యవస్థగా ఉండాలని, కానీ రాజకీయ జ్యోక్యానికి అతీతంగా న్యాయ వ్యవస్థ తమ సేవలు అందించాలని అన్నారు. దేశంలోని న్యాయస్థానాలలో సుమారు మూడున్నర కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండగా, తదుపరి విచారణ తేదీని నిర్ణయంచని కేసులే 35 లక్షలు చేరినట్లు జాతీయ న్యాయ డేటాగ్రిడ్ గణాంకాలు తేల్చిందని విశ్వనాధ్ అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరగకపోవడానికి యిదే ప్రధాన కారణమని అన్నారు. మాచవరం గ్రామ పంచాయతీ గ్రామదర్శిని, స్టాట్యూటరీ గ్రామసభలో భాగంగా ఈ న్యాయ అవగాహనా సదస్సు ఏర్పాటు చెయ్యగా, కళాశాల ప్రినిసిపాల్ త్రినాధ్ కేంద్ర, రాష్ట్ర చట్టాలపై అవగాహన కల్పించారు. సుమారు 30 మంది న్యాయ విద్యార్థులు సదస్సులో పాల్గొనగా, మండల పరిషద్ అధ్యక్షులు దాసరి వీర వెంకట సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యులు బొంతు గంగాధర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జైరాజ్, మండల ప్రత్యేక అధికారి దుర్గ ప్రసాద్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గణపతి బాబులు, ప్రాధిమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గణపతి వీర రాఘవులు, బాలాజీ, మండల స్థాయి అధికారులు, మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గున్నారు. అనంతరం న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ త్రినాధ్ ని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు.

తూతిక శ్రీనివాస విశ్వనాధ్
మండల పరిషద్ అభివృద్ధి అధికారి
అంబాజీపేట, 7675924666

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss