NEWS

ఆకలితో అలమటిస్తున్నారు – చాపర చేనేత కార్మికుల కన్నీటి బాదలు – తిత్లీ తుఫానుతో మూల

శ్రీకాకుళం, మిళియాపుట్టి మండలం, చాపర చేనేత కార్మికుల కన్నీటి బాదలు.. తిత్లీ తుఫానుతో మూలన పడ్డ మగ్గాలు, రోడ్డున పడ్డ బ్రతుకులు

తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేయగా.. తిత్లీ దెబ్బకు నేతన్నలు వృత్తి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఇంటీరియర్ ప్రాంతమైన చాపర చేనేత కార్మికులను ముందుగా కలవడం జరిగింది. మిళియాపుట్టిలో ప్రముఖంగా దేవాంగులు, పట్టశాలీలు ఉన్నారు. నేత వృత్తే ఆదారం. తుఫాను తాకిడికి ఈ ప్రాంతంలో కరంటు లేక అందకారంలో ఉంటునన్నారు. కొన్ని రోజులుగా త్రాగడానికి నీరు లేక, తినడనికి తిండి కరువై ఆకలితో పస్తులుంటున్న పరిస్థితిని దగ్గిర నుంచి చూడడం జరిగింది. సమాచార వ్యవస్థ లేకపోవడం వలన బాహ్యప్రపంచంతో సంభందాలు తెగిపోయాయి. ఆదుకోవలిసిన ప్రభుత్వం ఆలస్యంగా స్పందించి, సహకరించ వలిసిన అదికారులు నేటికి ఈ ప్రాంతానికి రాకపోతే మాకు దిక్కెవరని కన్నీళ్ళ పర్యంతం అవుతుంటే ఇక్కడ పరిస్థితిని అంచనా వేయవచ్చు. మేమున్నామని భరోసా కల్పించే నాయకులు కూడా ఈ ప్రాంతాన్ని సంధర్శించ లేదని, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కుల సంఘాలున్నాయని వినికిడేగాని మా సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని చేనేత మహిళలు వాపోయారు. ఎప్పుడో అఖిల భారత దేవాంగ మహాసభలకు పిలుపొచ్చింది రాజమండ్రి రమ్మని సుమారు ఆరు సంవత్షరాలు కావత్సుందను కుంటా నాటి నేటి ఒరకు ఒక్క కులపెద్ద వస్తే ఒట్టు అని ఇక్కడ వృద్దాప్య పించను అందుకుంటున్న పెద్దలు అంటుంటే జిల్లా సంఘానికి, రాష్ట్ర సంఘానికి ఈ ప్రాంత కులస్థుల అనుభందం ఏవిదంగా ఉందో అర్థమవుతుంది. నేను రాష్ట్ర సంఘం నుంచే వచ్చాను అని ఏదో చెప్పబోతే మీమ్మల్ని ఎప్పుడూ చూడలేదు బాబు.. తుఫాను బాదితులు కదా మాకు ఉప్పులు, పప్పులు ఉచితంగా ఇచ్చి వెళ్ళిపోతారా.. అని ప్రశ్నిస్తే నాయకులుగా అతఃర్మదనం చేసుకోవలిసిన పరిస్థితి ఏర్పడింది.

మాకు గుప్పిడంత ప్రేమ కావాలి..

మాకు ఉచిత ఉప్పు, పప్పు, బియ్యం, విరాళాలం కాదు. మేము చేనేత కులస్తులమే, మా యింటి పేరు ఆనం, బళ్ళా, యర్రా, మచ్చా.. ఇక్కడ సుమారు నాలుగు వందలమంది ఉన్నాము. అత్యంత పేదరికం, నేత మీదే ఆదారపడి బ్రతుకుతున్నాం, సహకార సంఘం పూర్తిగా నష్టాల్లో ఉంది. జియస్టీ వలన, ప్రభుత్వం నుంచి ఆదరణ లేకపోవడం వలన ఉపాది కూలిపనులు చేసుకుంటున్నాము, చేనేతకు ఏదేదో చేస్తుందన్న ప్రభుత్వ పథకాలు మాకైతే అందడం లేదు. నాయకులు రారు, అదికారులు చెప్పరు.. మాకు సంఘం నుంచి ఉచితంగా ఇచ్చే అపరాలు, విరాళాలు వద్దు.. సంఘ నాయకులు చూపించే ప్రేమ, మీతో మేమందరం ఉన్నామనే ధైర్యం, శాశ్వత ప్రాతిపదకన ప్రభుత్వం నుంచి రావలిసిన రాయతీలు, అప్పుడప్పుడు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకుల ఈ ప్రాంతం సంధర్శన అంతే.. మీరు వస్తూ పోతుంటే స్థానికంగా మా ఉనికి, గుర్తింపు ఉంటుంది ఇదే మాకు కావలిసిందని ఈ ప్రాంతాన్ని సంధర్శించిన వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ బృందంతో వాపోయారు

మండలాన్ని కరువు మండలంగా డిక్లర్ చేయమని

 

వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ తరుపున తిత్లీ తుఫాను బాదితులకు సహాయమందించమని, ముఖ్యంగా ఈ మండలాన్ని కరువు మండలంగా డిక్లర్ చేయమని జిల్లా చేనేత & జౌళ శాఖ అదికారిని కోరడమైనది. సంభందిత అదికారి నివేదిక ప్రకారం శ్రీకాకుళంలో 42 చేనేత సహకార సంఘాలున్నాయని, సుమారు 5000 మంది అదికారికంగా నేతవృత్తి చేస్తున్నారని, నాలుగు మండలాలనే కరువు మండలంగా డిక్లర్ చేసామని వివరణ ఇవ్వగా, ఫ్రంట్ తరుపున స్పందిస్తు చేనేత కార్మికులు వృత్తి కోల్పోవడమంటే తుఫాను వలన మగ్గాలలో నీరు ఉండడమే కాదని, కరంటు కోతవలన కూడా వృత్తి కోల్పోతారని, కరంటు కోత మండలాలు చాలా ఉన్నాయని, పూర్తిస్థాయిలో ఎన్యూమరేషన్ చేయమని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన అసిస్టెంట్ డైరక్టర్ చేనేత కార్మికులకు పూర్తి సహాయం చేస్తామన్నారు. సమస్యల నమోదులో భాగంగా చేనేత మహిళలను పసుపు కుంకుమ పథకంలో నమోదు చేయలేదని తెలుసుకొని ఏపియం వెలుగుతో మాట్లాడితే రెండు రోజులలో నమోదు పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే చదువు కుంటున్న పిల్లలకు స్కాలర్ రావట్లేదని తెలిసి డి.ఆర్.డి.ఏ అదికారులతో మాట్లాడడం జరిగింది. అందకారంలో ఉన్న ఈ ప్రాంతానికి హెవీ డ్యూటీ జెనరేటర్ రప్పించి విద్యుత్తు పునఃరుద్దరణ అయ్యేంత వరకు కరంటు, త్రాగునీరు సరఫరా చేయించడం జరిగింది, చాపరలో ఈ ప్రాంతం నుండే పారిశుద్ధ్యం చర్యలు చేపట్టడం జరిగింది. సంభందిత బ్యాంకు అదికారులతో మాట్లాడి రాయితీ మంజూరు విషయంలో చర్యతీసుకోవడం జరిగిందో. మగ్గాలు కావలిసిన వారికి ఆదరణ పథకంలో మంజూరుకు లబ్దిదారుల లిస్టు తయారు చేయడం జరిగింది. ఇప్పుడే అందిన సమాచారం మేరకు ప్రతి కుటుంబానికి 25 కెజీలు బియ్యం, 1కెజి కందిపప్పు, నూనె, 1/2 కెజి పంచదార తదితర నిత్యవసర వస్థువులు ఉచితంగా అందనున్నాయి.

సామాజిక చైతన్యంలో భాగంగా తేది 17.10.18చలో మిళియాపుట్టికార్యక్రమానికి వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ పిలుపు

మిళియాపుట్టి చేనేత కులస్థులకు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం, రాష్ట్ర పట్టుశాలీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్, వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ చేనేత కులాల సంక్షేమం కోసం చేస్తున్న సామాజిక, చైతన్య కార్యకలాపాలపై స్థానిక చేనేత వర్గీయులతో చర్చించడం జరిగింది. గతంలో జరిగిన పొరపాటులను సరిచేసుకొని ప్రతి విషయంలో ఈ ప్రాంత కులభాందవ్యులకు అందుబాటులో ఉంటామని భరోసా కల్పించడం జరిగింది. వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ మిళియాపుట్టి శాఖ ఏర్పాటు చేసి అద్యక్ష, ప్రదాన కార్యధర్శులను ఎంపిక చేయడం జరిగింది. వీరి ఆద్వర్యంలోనే ఈ రోజు చలో మిళియాపుట్టి కార్యక్రమం అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణా కార్డులు పుణఃరుద్దరన కోసం, చేనేత బృతి జీవో కోసం, చేనేత కులాల కార్పోరేషన్ కోసం, ఇలా ముఖ్యమైన డిమాండ్లకతో చేపట్టడం జరుగుతుంది.

ప్రతి విషయంలో సహకరించిన మిళియాపుట్టి అదికారులకు, ఈ ప్రాంత చేనేత కులస్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, కులభాందవ్యులకు సేవలందించే మంచి అవకాశం ఇచ్చిన వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ పొలిట్ బ్యూరో సభ్యులకు కృతజ్ఞలు తెలుపుకుంటున్నాను

భవదీయుడు

తూతిక శ్రీనివాస విశ్వనాథ్, రాష్ట్ర ప్రదాన కార్యధర్శి, ఆంధ్రప్రదేశ్, వీవర్స్ యునైటడ్ ఫ్రంట్, 7675924666
(ఒరిస్సా రాష్ట్రం, గజపతి జిల్లా, గారబంద గ్రామం నుంచి).

 

Please email us for updates and corrections, publish@mydigitalnews.in , Whatsapp 888 5555 924

Topics