NEWS

బీసీ ఉద్యోగుల కార్తీక వన సమారాధన

అంబాజీపేట : బీసీ ఉద్యోగుల ఐక్యతే ప్రధాన లక్ష్యంగా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన కాకినాడ ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రాంగణంలో తేదీ 10 నవంబర్ 2018న జరపనున్నామని బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు, మండల పరిషద్ అభివృద్ధి అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.

జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఇళ్ల సత్యనారాయణ, గుత్తుల వీరబ్రహ్మం జిల్లా పర్యటనలో భాగంగా మండల ప్రజా పరిషద్ అధ్యక్షులు దాసరి వీరవెంకట సత్యనారాయణ, జిల్లా ప్రాదేశిక సభ్యులు బొంతు గంగాధర్ ఇతర బీసీ నాయకులను కలిసి ఆహ్వానం పలకడానికి వచ్చారు. సందర్భంగా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ద్వితీయ కార్తీక వన సమారాధన బ్రోచర్ ఎంపీపీ దాసరి చేతులమీద స్థానిక అధికారులు, ప్రాణ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. సందర్భంగా ఇళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో సుమారు 25 వేలమంది బీసీ ఉద్యోగులు ఉన్నారని, వీరి సంక్షేమమే ప్రధాన అజెండాగా బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని అన్నారు. వనసమారాధనకు బీసీ ఉద్యోగులు, కుటుంభ సభ్యులతో సహా సుమారు 15 వేలమంది రావచ్చని అన్నారు.

పిల్లలకు, మహిళలకు ప్రత్యేక ఆటలపోటీలు, రంగోలి తదితర వినోదభరితమైన కార్యక్రమాలు ఉంటాయని ప్రధాన కార్యదర్శి వీరబ్రహ్మం అన్నారు.

తూతిక శ్రీనివాస విశ్వనాధ్
మండల పరిషద్ అభివృద్ధి అధికారి
అంబాజీపేట
7675924666

Topics