NEWS

మంచి విషయాన్ని  మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

ఆంధ్రప్రదేశ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, గ్రూప్ 1లో ఉత్తీర్ణత సాదించిన తర్వాత మండల పరిషత్ అభివృద్ధి అదికారిగా  సేవలందించడానికి నేను తూర్పుగోదావరి జిల్లా ఎంపిక చేసుకున్న తొలి రోజుళ్ళో 2007 సంవత్సరం.. జిల్లాలో డా బాబాసాహేబ్ అంబేద్కర్ వారి భావజాలం బలంగా ఉండేది కాని భారతదేశ మొట్టమెదటి సామాజిక విప్లవకారుడు, బడుగు, బలహిన వర్గాల ఆశాజ్యోతి, సర్వజనహితుడైన రాష్ట్రపిత మహాత్మజ్యోతి రావు ఫూలే అని కొంత మందికే తెలిసినా.. గ్రామాలలో, క్షేత్రస్థాయి వర్గీయులలో ఫూలే గారి ఆలోచనా విదానం చాలామందికి తెలియదనే చెప్పాలి. అప్పటికే జిల్లాలో  ఉద్యోగులు ఫూలే సావిత్రిభాయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి  ఉత్తీర్ణత పొందిన పిల్లలకు ప్రతి సంవత్సరం స్కాలర్ షిప్పులు ఇవ్వడం జరుపుతు ఫూలే గారి, అంబేద్కర్ గారి  భావజాలాన్ని సమాజంలోకి తీసుకు వెళ్ళడానికి జిల్లాలో ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి.

అదేకోవలో బీసీ ఉద్యోగుల సంఘం ఆవిర్భవించి ప్రతి సంవత్సరం ఫూలే గారి జయంతి, వర్దంతి కార్యక్రమాలు జరుపుతు ఫూలే గారి సిద్దాంతాలను సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కానీ జిల్లా విస్తీర్ణం వలన, ఇతర అంశాల వలన  అనుకున్న స్థాయిలో కా‌ర్యక్రమాలు విస్థరించేక పోవడం జరిగింది.  ఆ సంధర్భంలో నాకొచ్చిన ఆలోచన జాతిపిత గాందీ, మహాత్మా ఫూలే, డా. అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయ్యాలని  అయితే ప్రభుత్వ కార్యాలయాలలో జాతిపిత గాందీ, డా.బాబాసాహేబ్, తూర్పుగోదావరి జిల్లా ఆరాద్యుడైన సర్ కాటన్ దొరగారి విగ్రహాలు తప్పు ఇంకొకరి విగ్రహాలు ప్రభుత్వ కార్యాలయా‌లో ఏర్పాటు చేయడానికి ఏ ప్రభుత్వ ఉద్యోగి  సాహసించ లేరు. 

దీనికి కారణం కూడా లేకపోలేదు.. విగ్రహాల ఏర్పాటుకు అనేక అనుమతులు, బడ్జట్టు కేటాయింపులు అనంతరం ఆడిటింగు.. ఇలా చాలా విషయాలను విగ్రహ ఏర్పాటు విషయంలో పరిగనలోకి తీసుకోవాలి.  ముఖ్యంగా స్థానిక  రాజకీయనాయకులు, నియోజకవర్గం రాజకీయ నాయకుల అభాప్రాయం పరిగనలోకి తీసుకోవాలి.  ఒకవేళ ఎవరి నుంచి అయినా ఫిర్యాదు వస్తే రాజకీయ చట్రంలో బలి అయ్యేది ఆ ప్రతిపాదన తీసుకు వచ్చిన అదికారే.. అందువలన ప్రశాంతంగా ఉన్న ఉద్యోగులు ఇటువంటి తీవ్రమైన అంశాలైన విగ్రహాల ఏర్పాటు జోలికి సహజంగా వెళ్ళరు. అయితే సర్వజన హితం కోసం అనేక వేదికల మీద జిల్లాలో ఫూలే, అంబేడ్కర్ గారి విగ్రహాల ఏర్పాటు చేయాలని పిలుపిచ్చిన నేను నేనే  ఎందుకు సేవలందిస్తున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయకూడదనే ఆలోచన వచ్చి ఆచరణకు సన్నతమయ్యాను. దానిలో భాగంగా మొట్ట మొదటి సారిగా పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలంలో జాతిపిత గాందీ, మహాత్మ ఫూలే, డా. బాబాసాహేబ్ అంబేడ్కర్, స్వామి వివేకనందా, మదర్ థెరిసా విగ్రహాలతో మహనీయుల మందిరం గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అదికారికంగా విగ్రహాల ఆవిష్కరణ చేసి పిఠాపురం నియోజకవర్గం  ఆత్మీయ ప్రజలకు, జిల్లాకి స్పూర్తి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన విగ్రహాల ఆవిష్కరణ విషయంలో అప్పుటి నియోజకవర్గ శాశన సభ్యులకు నాకు తీవ్ర వాగ్వివాదం జరిగినా పిఠాపురం నియోజకవర్గం ప్రజల సహకారంతో విగ్రహాల ఆవిష్కరణ అడ్డంకులను అదిగమించి స్థానిక నాయకులు, పత్రికా సోదరులు ప్రజల  సహారంతో మహనీయుల మందిరం ఫూలే జయంతి రోజైన  ఏప్రిల్ 14, 2012న అత్యంత వైభవోపేతంగా ప్రజల సమక్షంలో  ప్రారంభించుకోవడం జరిగింది. ఈ విగ్రహాల ఏర్పుటుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మొక్కవోని దీక్షలా గొల్లప్రోలులో మహనీయుల మందిరం  ఏర్పాటు చేయించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో, తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మ ఫూలే విగ్రహాం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వ అదికారిగా ఆ అవకాసం దక్కినందుకు అందరికి కృతజ్ఞుడను.

చిత్రమేమిటంటే గాందీ, ఫూలే, అంబేద్కర్, వివేకానంద, మదర్ థేరీసా విగ్రహాల ఆవిష్కరణకు ఆది నుంచి అడ్డంకిగా ఉన్న పిఠాపురం శాశన సభ్యులు విగ్రహాల ప్రారంభోత్సవ వేడుకలకు అందుబాటులో ఉండి కూడా రాకపోవడం శోచనీయం. అందుకే నేటికీ గొల్లప్రోలు మండల కార్యాలయంలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు సంభందించిన శిలాఫలకం ఉండదు.  నాటి నుండి ప్రారంభమైన ఈ యజ్ఞం నేటివరకు ఆగకుండా నేనెక్కడకి బదిలీ అయినా ఆ మండల కార్యాలయాలలో నాయకులు, ప్రజలు, అదికారుల సహకారంతో  గాందీ, డా. అంబేద్కర్, ఫూలే గార్ల విగ్రహాలు ఏర్పాటు చేస్తు వస్తున్నాను. ఇక ముందుకూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. సర్వజన హితం కోసం మహనీయుల స్పూర్తిని కొనసాగించడానికి, దేశ, జాతి, ప్రజా స్పూర్తి ప్రదాతల విగ్రహాలు ఏర్పాటు చేయడం తప్పుకాదని భవిస్తున్న వ్యక్తులలో నేనెప్పడు ఉంటాను కాబట్టి ఆదర్శమూర్తుల విగ్రహాల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఈ మహాత్మ ఫూలే వర్దంతి సంధర్భంగా ఆత్మీయులైన మీతో పంచుకోవడం జరుగుతుంది.  అనంతరం ప్రభుత్వాలే అదికారికంగా ప్రతి జిల్లా కేంద్రాలలో ఫూలే విగ్రహాలు ఏర్పాటు చేయమని 2013 సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.  ఈ దేశానికి ఫూలే, అంబేద్కర్ ఆలోచన విదానమే శరణ్యం అని ప్రజలందరు  తెలుకోవాలని నా విజ్ఞప్తి.

తూతిక శ్రీనివాస విశ్వనాథ్, MBA, LLM, మాజీ సైనికుడు, మండల పరిషత్ అభివృద్ధి అదికారి, 7675924666

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics