NEWS

పిఠాపురం అసంబ్లీ సీటు బీసీలకు కేటాయించాలి. వీవర్స్ యునైటడ్ ఫ్రంట్

పిఠాపురం :  బీసీ జనాభా అత్యదికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం బీసీలకు కేటాయించాలని అంబాజీపేట యంపిడిఓ,  ఆంధ్రప్రదేశ్, వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రదాన కార్యధర్శి  తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్ని రాజకీయ పార్టీలకు  కోరారు. పిఠాపురం విరవ రోడ్డు సమీపంలో కొబ్బరి తోటలో ఆంధ్రప్రదేశ్, వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ ఆద్వర్యంలో చేనేత కులాల కార్తీక వన సమారాదన ఘనంగా జరిగింది. సంధర్భంగా శీరం లక్ష్మణ ప్రసాద్ ఆద్వర్యంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వనాథ్ మాట్లాడుతు పిఠాపురం నియోజకవర్గం ఆవిర్భవం నాటి నుండి బీసీ, యస్సీ సామాజిక వర్గం నుండి ఎవరు చట్టసభలలో అడుగుపెట్టక పోవడం వలన ఈ వర్గాలలో సామాజిక న్యాయం జరగలేదని అన్నారు.  పిఠాపురం నియోజకవర్గంలో సమారు రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఉంటే  రమారమి లక్షా పద్దేనిమి వేల ఓట్లుతో బీసీ సామాజిక వర్గం నియోజకవర్గంలో అగ్రగామిగా నిలిస్తే వీరిలో చేనేత, శెట్టిబలిజ, వాడబలిజ అదికమని అన్నారు. రాజకీయ పార్టీలు సామాజిక న్యాయాన్ని గౌరవించాలను కుంటే సేవా దృక్పదం, పాలనా దక్షత, సమీకృత అభివృద్ధిని కాంక్షించి  ప్రజల పక్షాన నిలిచే బీసీ సామాజిక వర్గానికి  రాబోవు అసంబ్లీ ఎన్నికలలో అవకాశం కల్పించాలని కోరారు. 

నియోజకవర్గం టికెట్టు బీసీలకు టికెట్టు కాపు, యస్సీ, మైనారిటీ, ఇతర సామాజిక వర్గాల సహకారంతో రాష్ట్రంలో అత్యదిక మెజారిటీతో గెలిచే నియోజకవర్గంగా  పిఠాపురం నిలుస్తుందని విశ్వనాథ్ అన్నారు. సహజవనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న పిఠాపురం పాలకుల అసమర్థత వలన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలో ప్రదమం, తలసరి ఆదాయంలో అదమంగా నిలిచిందని అన్నారు. అందుకే పిఠాపురం ప్రజలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని గుర్తు చేసారు.  సమస్యల వలయంలో  పిఠాపురం నియోజకవర్గం ప్రజలు కూరుకుపోక ముందే అదికార మార్పిడి జరగాలని, సమర్దత గల బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ 15 అసంబ్లీ స్థానాలు, 5 యంపి స్థానాలను అన్ని రాజకీయ పార్టీల నుంచి కోరతుందని, జిల్లాలో కనీసం రెండు అసంబ్లీ స్థానాలు  చేనేత వర్గీయులకు రాజకీయ పార్టీలు కేటాయించ వచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ విషయంలో ఫ్రంట్ పొలిట్ బ్యూరో సభ్యులు అన్ని రాజకీయ పార్టీ ప్రతినిదులను కలవనున్నారని విశ్వనాథ్ అన్నారు. కార్యక్రమంలో పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్మన్, వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ వ్యవస్థాపక ఉపాద్యక్షులు శీరం శ్రీరామ చంద్యమూర్తిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఫ్రంట్ ఉపాద్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు లొల్ల సత్యనారాయణ, రాజాపంతుల నాగేశ్వరరావు, రాపర్తి జయవీర్, వడిగ సూరిబాబు, కొమ్మాకుల సత్యనారాయణ, అదిక సంఖ్యలో చేనేత సంఘీయులు పాల్గొన్నారు. 

తూతిక శ్రీనివాస విశ్వనాథ్, యంపిడిఓ, 7675924666

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics