NEWS

మత్సకారులకు “రాయల్టీ” ఇవ్వాలి.. పిఠాపురం కేంద్రంగా త్వరలో భారీ ఉద్యమానికి శ్రీకారం

బీసీ భందువులారా,  వాడబలిజ కుల భాంధవ్యులరా, జన్మతః సముద్రం మీద హక్కులు కలిగిన జాతి మనది.. వేట మన కులవృత్తి, ఇప్పటిది కాదు అనాదిగా సముద్రాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న మత్సకారులం మనం. సముద్రం మీద జరిగే వ్యాపారాలలో పోటీ పెరిగి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు లక్షల కోట్ల రూపాయిలు దోచుకుంటున్నారు. సముద్రం మీద వర్తక వ్యాపారాల పేరుమీద ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు యుగ యుగాలుగా మనకు వారసత్వంగా వస్తున్నా సముద్ర హక్కులను కాలరాసి మన జీవన ఉనికిని ప్రశ్నర్ధకం చేస్తున్నారు. ఇప్పటికే మనం చాల నష్టపోయాం. మన జాతిలో ఉన్న నిరక్షరాస్యత వలన, అమాయకత్వం వలన  మన వాడబలిజ జాతికి జారుతున్న నష్టాన్ని అంచనా వెయ్యలేకపోతున్నాం.. వాడబలిజలకు జరుగుతున్నా నష్టాన్ని ఇప్పుడు ప్రశ్నించకపోతే భావితరాల మన బిడ్డలకు, వారసులకు తీవ్రమైన అన్యాయం చేసిన వారమవుతాము, మన ఉనికిని సమాజంలో కోల్పోతాము… అందుకే మనకు రావలిసిన వాటా మనం దక్కించుకోవాలిసిందే. ఇది మానహక్కు… సముద్రం మీద జరుగుతున్నా కోట్లాది రూపాయల వర్తక వ్యాపారాలలో మత్సకార వాడబలిజలకు “రాయల్టీ” సాధించుకోవాలి. సముద్ర వ్యాపారాలలో రాయల్టీ మనం సాదించుకుంటే ప్రతి వాడబలిజ కుటుంబానికి నెలకు సుమారు యాభైవేల నుంచి లక్ష రూపాయలు వరకు ఉచితంగా మన డబ్బు మనకు వాటాకు వస్తుంది. అందుకే,  “సముద్రం మనదే.. సముద్రం పై హక్కులు మనవే” అనే భావనకు నేను రూపకల్పన చెయ్యడం జరిగింది. రాయల్టీ గనుక మనం సాధించు కుంటే సమాజంలో వాడబలిజలు కూడా ఆర్ధిక భద్రతతో జీవించవచ్చు, సామజిక గుర్తింపు పొందవచ్చు, రాజకీయంగా ఎదగచ్చు… ఆత్మీయులైన వాడబలిజ, మత్సకార, గంగపుత్ర, బేస్త, జాలర తదితర వేటను నమ్ముకుని వారసత్వంగా బ్రతుకుతున్న కుల భాంధవ్యులరా, నాయకులారా, ఉద్యమ కారులారా,  ఉద్యమాల జిల్లా తూర్పుగోదావరి జిల్లా నుండి,  పిఠాపురం నియోజకవర్గ, ఉప్పాడ కొత్తపల్లి కేంద్రంగా “సముద్రం మనదే – సముద్రం మీద హక్కులు మనవే” అనే సామజిక ఉద్యమానికి మనమందరం ‘శ్రీకారం’ చుడదాం.. సముద్రం మీద మన వారసత్వ హక్కుల కోసం ఉద్యమిద్దాం… సముద్రం మీద జరిగే లక్షలాది కోట్లాది వర్తక వ్యాపారాలలో మన వాటా రాయల్టీ రూపంలో సాధించు కుందాం. .. ఆలోచించండి.. వాడబలిజ కుల నాయకులు, పెద్ద సహకారంతో  ఉద్యమదిశగా పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం వాడబలిజ కుల భాంధవ్యాలు ఉద్యమించండానికి సిద్దంగా ఉందాం.. మత్సకార, వాడబలిజ జాతి ప్రయోజనాల కోసం జరుపుతున్న ఈ మహా యజ్ఞంలో అందరు సహకరించాలని ప్రార్థన

(వాడబలిజ జాతి ప్రయోజనాల కోసం ఈ సమాచారాన్ని అందరితో పంచుకోగలరని మనవి)

తూతిక శ్రీనివాస విశ్వనాధ్, మండల పరిషద్ అభివృద్ధి అధికారి, 7675924666,  Fb: Tutika Srinivasa Viswanadh, E-mail: janatasatta@gmail.com

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss