NEWS

సిపియస్ రద్దు కోసం కాకినాడలో జరపబోవు సమరభేరకి ఆత్మీయ ఆహ్వానం…

ఉద్యోగ ఉపాద్యాయులారా .. …రండి కాకినాడ దద్దరిల్లాలి..సిపియస్ రద్దుకావాలి..

APCPSUS తూర్పు గోదావరి. కాకినాడ సమరభేరి DEC 8వ

కమిటీ అంటూ కబుర్లు చెప్పినవారికి,కళ్ళు తెరిపించేదే..

మన కాకినాడ సమరభేరి..!

కల్లిబొల్లి కాకమ్మ కథలు చెప్పేవారికి ,కాలజ్ఞానం చెప్పేదే..

మన కాకినాడ సమరభేరి..!!
టక్కర్ కమిటీ అంటూ..

టక్కరి వేషాలు వేసేవారికి..

తిక్కరేగే జవాబు చెప్పేదే.. 

మన కాకినాడ సమరభేరి..!
ఎన్నాళ్ళో నుంచి నాంచి,నాంచి..

ఎన్నికల ముందు గీచి,గీచి…

‘ఎన్ని’కల వేషాలు వేసేవారికి..

ఎదురుదెబ్బ తీసేదే..

మన కాకినాడ..సమరభేరి..!!
తుఫాన్ ముందు హెచ్చరికలా..

సునామి ముందు నిశ్శబ్దంలా..

భూకంపం ముందు సూచికలా..

రద్దు కాకపోతే..చేయకపోతే..

రాబోయే ప్రళయానికి ఆనవాలు..

మన కాకినాడ సమరభేరి..!!
పాలకులకు చివరి అవకాశం..

చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి.

CPS సోదరులకు ఆఖరి అవకాశం..

భద్రత కల్గిన OPS పొందడానికి..!!
ఆలోచించే సమయం లేదు…

మళ్ళీ చేద్దామంటూ వాయిదా వేసే అవకాశం లేదు..

మొన్న వచ్చాను కదా అని మిన్నండి పోయే ఛాన్స్  తీసుకునే టైం లేదు..
CPS సోదరా… సమరభేరిలో పాల్గొని..

సత్తా చూపిద్దాం. OPS మన హక్కు అని..ఎలుగెత్తి చాటుదాం.!!
డిసెంబర్ 8 సమరభేరి..మన కలల రహదారి..

మనమంతా కాకినాడలో చేరి..మోగిదాం ఆశల సమరభేరి..!!
సోదరులారా…

కలుద్దాం..కాకినాడలో..

చరిత్రలో నిలుద్దాం..OPS సాధనలో..!!

తూతిక శ్రీనివాస విశ్వనాథ్, MBA, LLM, మాజీ సైనికుడు,మండల పరిషత్ అభివృద్ధి అదికారి, గౌరవ అద్యక్షులు, ఎపిసిపియస్ ఉద్యోగ, ఉపాద్యాయ సంఘం, తూర్పుగోదావరి జిల్లా, 7675924666

Topics