NEWS

సిపిఎస్  విధానాన్ని రద్దు చేసేంతవరకు ఉద్యమం ఆగదు.  కాకినాడలో జరిగిన ఉద్యోగుల సమరభేరిలో  యంపిడిఓ విశ్వనాథ్

కాకినాడ : సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిర్వహించిన సమభేరి కార్యక్రమం విజయవంతం అయ్యింది. దాదాపు పదిహేను వేలమంది పాల్గొన్న సమరభేరి కార్యక్రమం ముందుగా ఉద్యోగులు కాకినాడ మెక్రేలిన్ కాలేజీ గ్రౌండ్ నుంచి పాదయాత్రలో పాల్గొని అనంతరం  ఆనందభారతి గ్రౌండ్ నందు బహిరంగ సభ నిర్వహించారు.

  కార్యక్రమం జిల్లా ఏపిసిపిఎస్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో జరుగగా, వేదికకు ఏపిసిపిఎస్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు రవి కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రంలో తూర్పుగోదావరి జిల్లా ఏపిసిపిఎస్ ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షులు,  అంబాజీపేట మండల పరిషద్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ పింఛను ఉద్యోగుల జీవితాలు అంధకారం నుంచి బైటపడి వెలుగులోకి రావాలంటే సిపిఎస్ విధానం రద్దు కావాల్సిందేనని అన్నారు. 
సిపిఎస్ విధానం రద్దు చేసే అంశంలో ప్రభుత్వం వేసిన టక్కర్ కమిటీ ఒక కాలయాపన కమిటీ అని దీనివలన ఉద్యోగులకు ఒరిగేదేమి లేదని ఎద్దేవా చేసారు. ప్రభత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటె తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్దరించామని డిమాండ్ చేసారు. ఉద్యోగుల పింఛను విధానంలో  ప్రభుత్వాలు ఒకే పద్దతిని అవలంబించాలని 1982లో  దేశ అత్యున్నత నాయస్థానం ఇచ్చిన  తీర్పును గుర్తు చేసారు. పింఛను బిక్ష కాదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కని ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు సమరభేరి పోరాటం కొనసాగిస్తారని అన్నారు. తమ ప్రభుత్వం వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన వైఎస్సార్ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని విశ్వనాధ్ తప్పుపడుతూ, వచ్చే అసెంబ్లీ సమావేశాలలో వైఎస్సార్ పార్టీ శాసన సభ్యులతో సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ ప్రైవేట్ బిల్లుకి నోటీసు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోమని డిమాండ్ చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తమ జనసేన పార్టీ మేనిఫెస్టో లో సిపిఎస్ విధానాన్ని రద్దు అంశాన్ని పెట్టడం కాదని, జనసేన పార్టీ అధికార బృందం ముఖ్యమంత్రితో చర్చించి సిపిఎస్ రద్దుకు సహకరించాలని అన్నారు. ఫ్యాక్టో జనరల్ సెక్రటరీ వెకంటేశ్వరులు మాట్లాడుతో సిపిఎస్ పాపం పాలకులదేనని, ఉద్యమం ద్వారానే మన హక్కులు సాధించు కోవాలని అన్నారు. రాష్ట్ర నాయకులు ముని ప్రసాద్ మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అసెంబ్లీలో సిపిఎస్ రద్దు చేస్తూ తీర్మానం చేసి దేశానికే ఆదర్శం అయ్యారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బూరుగు ఆశీర్వాదం మాట్లాడుతూ సిపిఎస్ రద్దు విషయమే తమ సంఘం మొదటి ఎజండా అని, సిపిఎస్ రద్దు విషయంలో ఎన్జీవో సంఘం సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు.  ఉద్యోగుల సమరభేరి కార్యక్రమానికి ఫాక్టో, జాక్టో, యుటిఎఫ్, ఎస్టీయు, ఎపిటిఎఫ్, పిఇటి, పీఆర్టీయు, గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు పాల్గొని మద్దతు ప్రకటించగా ప్రభుత్వం సిపిఎస్ రద్దు చెయ్యాలని, సిపిఎస్ రద్దు విషయంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఐక్య ఉద్యమ పోరాటం చెయ్యాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి జనవరి నెలలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సమ్మెకు వెళ్లాలని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాయి. కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్ ముఖచిత్రంగా ఉన్న పేస్ మాస్కులతో అలరించిన తీరు అందరిని ఆకట్టుకోగా, మాజీ శాసన సభ్యులు నల్లమిల్లి శేషారెడ్డి కొత్తపేట ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు భవనం  పైకప్పు కూలిపోయి మరణించిన సిపిఎస్ ఉద్యోగిని ఆదిలక్ష్మి కుటుంబానికి లక్ష రూపాయిలు సహాయం అందించారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు రాఘవులు, శ్రీనివాస్, దాసు, అలీం, బాషా, గోపాలం, నందీశ్వర్,  వెంకటరావు, సత్యనారాయణ, ఫిలిప్ రాజు, చంద్రశేఖర్, పిచ్చిక అనిల్ తదితరులు పాల్గొన్నారు.  
తూతిక శ్రీనివాస విశ్వనాధ్, మండల పరిషద్ అభివృద్ధి అధికారి,  అధ్యక్షుడు, తూర్పు గోదావరి ఏపీసీపీఎస్ ఉద్యోగ సంఘం, 7675924666

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics