NEWS

​ANU డిగ్రీ సెమిస్టర్ మూల్యాంకనంలో తప్పిదాలు… వేల మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళం

రీవాల్యుయేషన్ ఫీజులు వసూలే యూనివర్సిటీ లక్ష్యంగా మారిందని విద్యార్థుల ఆరోపణ.. జవాబు పత్రాలను  ఫీజు లేకుండా తిరిగి మూల్యాంకనం చేయించి న్యాయం చేయాలని విద్యార్థుల డిమాండ్……….      

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం  వారునవంబర్ మాసం చివరి వారంలోవిడుదల చేసిన డిగ్రీ సెమిస్టర్ ఫలితాల మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయని దీనివల్ల సుమారు 50 వేల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని అందరికీ న్యాయం చేయాలని  విద్యార్థులు, ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు వైస్ ఛాన్స్ లర్ రాజేంద్రప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. 

ఈ విద్యా సంవత్సరం అక్టోబర్ నెల లో నిర్వహించిన 1, 3, 5 .సెమిస్టర్ పరిక్షలో  యూనివర్సిటీ పరిధిలో 92,173 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 49,666 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, పాస్ అయిన విద్యార్థుల పర్సెంటేజ్ 44 శాతమేనని, యూనివర్సిటీ యంత్రాంగం రివాల్యూషన్ ఫీజు పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేయడానికి  ఇంతమందిని ఫెయిల్ చేశారని ఆరోపించారు, కొంతమంది  విద్యార్థులు మాట్లాడుతూ నరసరావుపేట లోని పేరొందిన డిగ్రీ కళాశాలలో చదువుతున్నానని పరీక్ష ఫలితాలు వెలువడిన తరువాత నాకు 0 (జీరో) మార్కులు వచ్చాయని ఆశ్చర్యానికి గురై  ప్రశ్న పత్రాలు  రూ/ 1200 రూపాయలు చెల్లించి జవాబు పత్రాలు తీసుకుని సబ్జెక్టు నిపుణుల చేత మూల్యాంకనం చేస్తే 70 మార్కులు  వచ్చాయని వాపోయారు. 


మరికొంతమందికి మూల్యాంకనం చేసిన తర్వాత మార్కులు కౌంట్ చేయడం మర్చిపోయి ఫెయిల్ చేశారని బాధ్యతారహితంగా వ్యవహరించాలని ఆవేదన వ్యక్తం చేశారు ,అర్హతలున్న నిపుణుల చేత పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేస్తే ఇటువంటి తప్పిదాలు జరగవన్నారు. యూనివర్శిటి యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ రీవాల్యుయేషన్ కి ఒక్కో సబ్జెక్టుకు 950 రూపాయలు వసూలు చేస్తున్నారని 50 వేల మంది దగ్గర కొన్ని కోట్ల రూపాయలకు  వసులు చేస్తున్నారని తెలియజేశారు. 2010 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు రీవాల్యుయేషన్ కొరకు విద్యార్థులు చెల్లించింది 25 కోట్ల రూపాయలు దాక ఉంటుందని ఈ సోమ్ము ఎక్కడ కు పోయిందో , చేసిన అభివృద్ధి ఏమిటో తెలియజేయాలని సిఐడి చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.. ఎంత మంది విద్యార్థులు ఫేయిల్ అవటానికి కారణం అర్హతలేని ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయడం ఒక కారణమైతే 25 రోజుల్లో రిజల్ట్ ఇచ్చి రికార్డు సృష్టించాలని యూ జి (U G) కోఆర్డినేటర్ గా ఉన్న ప్రస్తుత రిజిస్టర్ రోశయ్య ఆలోచనా విధానమే కారణం అని తెలియజేశారు. ఇన్ని వేల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు  కనుక అందరికీ రివల్యూషన్ ఫీజును మాఫీ చేసి ఉచితంగా జవాబు పత్రాలను రివల్యూషన్ చేసిఇవ్వాలని కోరారు, విద్యార్థుల సమస్యలు విన్న  వైస్ ఛాన్స్ లర్
రాజేంద్ర ప్రసాద్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో కమిటీని నియమించి విద్యార్థులకు న్యాయం చేస్తామని  చెప్పారు..   . హరికృష్ణ – sai ch,-ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics