NEWS

ABVP భంధ్. 11-12-2018

ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో పొన్నూరు నగరంలోని తిరుమల వాటర్ ప్లాంట్ నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ డి.గుప్తా మాట్లాడుతూ ఈ నెల 11 వ తారీకున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలను బంద్ కు పిలుపునివ్వడం జరుగుతుంది

కారణం: ఈ ఏడాది నవంబర్ నెల 26 వ తారీఖు న విడుదలైన టువంటి డిగ్రీ పరీక్షా ఫలితాలలో 96 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే కేవలం 42 వేల మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు . ఒక సెమిస్టర్ యొక్క పరీక్ష ఫీజు 635 రూపాయలు ఉంటే రీవాల్యుయేషన్ ఒక సబ్జెక్టు ఫీజు 935 రూపాయలు తీసుకోవడం దారుణమని ఆయన తెలియజేశారు. కేవలం రీవాల్యుయేషన్ డబ్బుల కోసమే విద్యార్థులను కావాలని తపిస్తున్నారని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా vc గారు స్పందించి రివల్యూషన్ కాస్ట్ ఆఫ్ రీవాల్యుయేషన్ చేయాలి అని ఆయన తెలియజేశారు. రివల్యూషన్ కాస్ట్ ఆఫ్ రీవాల్యుయేషన్ చేయాలి అని ఆయన తెలియజేశారు. ఈసారి కనుక ఇలా జరిగితే అటువంటి అధికారులపై కఠినమైన వైఖరి తీసుకోవాలి అని  ఆయన తెలియజేశారు. లేనియెడల రాబోయే రోజుల్లో విశ్వవిద్యాలయం ముట్టడి, జాతీయ రహదారి ముట్టడికి సైతం వెనకాడమని ఆయన తెలియజేశారు.అన్ని కళాశాల యాజమాన్యాలు బంద్కు సహకరించాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పొన్నూరు జిల్లా కో-కన్వీనర్ గుప్తా, నగర కార్యదర్శి ఆసిఫ్, బాగ్ కన్వీనర్ వంశీ ,గంగాధర్, ఇస్మాయిల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics