NEWS

అవినీతి మానవ అభివృద్దికి ఆటంకం’ – శ్రీనివాస విశ్వనాధ్-MPDO

పిఠాపురం అభివృద్ధి ఆటంకానికి అవినీతి ఒక కారణమే… డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం.. అవినీతికి వ్యతిరేకంగా పిఠాపురం ప్రజలు ఆలోచించాలి.

అవినీతి జాడ్యం సమాజాన్ని పట్టి పీడిస్తుంది. మానవ అభివృద్ధికి అవినీతి ఆటంకంగా మారింది. అందుకే సహజవనరులు రాష్ట్రంలోనే అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో సతమతమవు తున్నారంటే, అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారంటే పిఠాపురంలో అవినీతి ఏస్థాయిలో రాజ్యమేలుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు.. 

పిఠాపురం ప్రజలు ఎదుర్కుంటున్న ప్రదాన సమస్యలో అవినీతి ప్రధానమైనదని చెప్పకనే చెప్పచు… ఏ పనికైనా లంచం, కమిషన్ ఇవ్వనిదే పనికాదని ప్రజలందరికి తెలిసిన బహిరంగ రహస్యమే… ప్రభుత్వ అభివృద్ధి  పనులు ముందుకు సాగాలంటే నియోజకవర్గ స్థాయి నాయకుడి చేయి తడపాల్సిందేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.. పిఠాపురం ప్రజల ట్రాఫిక్  ఇక్కట్లు తీర్చడానికి  పిఠాపురం రాజావారి వారధి పక్కనే కొత్త రైల్వే ట్రాక్ ఫ్లై ఓవర్ కట్టాలని ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇచ్చినా.. టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్ స్థంస్థ యాజమాన్యం నుంచి ఓ మహారాజు కమిషన్ డిమాండ్ చేసి పనులకు ఆటంకం కల్పించడం మనకు తెలిసిందే.. అయితే సదరు కాంట్రాక్టు సంస్థ యజమాని ఫ్లై ఓవర్ పనులు వదులుకోవడానికి సిద్దపడతానే గాని కమిషన్, లంచం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఆ కమిషన్ మహారాజు  ఏమి చెయ్యలేక వెనకకు తగ్గినా విషయం మనం మరవక ముందే.. నీరు చెట్టు పనులలో కోట్లాది రూపాయిలు అవినీతి జరిగిందని ప్రజాపోరాట యాత్రలో భాగంగా పిఠాపురం బహిరంగ సభలో ఓ ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత  నియోజకవర్గ స్థాయి నాయకుడిపై విరుచుకుపడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ‘అవినీతి’ రాజ్యమేలుతున్న చోట చేపట్టిన పనులలో నాణ్యత ఉండదు. కాంట్రాక్టర్లు, అధికారులు, పాలకులు పెద్దమొత్తంలో అవినీతి రూపంలో చేతులు తడుపుతున్న ఫలితంగా రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఆనకట్టలు త్వరగా పాడైపోతాయి.. కోట్లాది రూపాయిల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది. ఇక్కడ ప్రజలు విఙ్ఞతగా గమనించ వల్సిన విషయమేమిటంటే, నాయకులు అవినీతి పరులైతే సరైన పరిశ్రమలు, పెట్టుబడులు నియోజకవర్గానికి రావు.. ఫలితం కాయకష్టం చేసుకొని, వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా పనులు చేసుకుంటు, చాలీ చాలని వేతనాలతో తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించినా, స్థానికంగా పరిశ్రమలు లేక, సరైన ఉద్యోగాలు సంపాదించ లేక, నిరుద్యోగులుగా ఉంటూ బాధపడుతున్నారు. అందుకే మానవ వనరులు పుష్కలంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది.. పిఠాపురం నియోజకవర్గం యువత నిరుద్యోగ సమస్యలో ముందువరసలో, ప్రజల తలసరి ఆదాయంలో ఆఖరి వరసలో రాష్ట్రంలోని అగ్రగామిగా ఉంది.. ప్రజలలో మార్పు రానంత వరకు అవినీతి జాడ్యంతో ప్రజలు ఇబ్బంది పడవలిసిందే.  ప్రజలలో ప్రశ్నించే తత్వం, పాలకులలో, అధికారులలో జవాభిదారి తనం పెరిగినప్పుడే అవినీతి తగ్గుముఖం పడుతుంది.  అయితే ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినపుడు ఉద్యోగం నుండి తొలగించడం ఒక్కటే సరైన శిక్ష అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అలాగే అవినీతి, కమిషన్ కక్కుర్తికి పాల్పడే లంచగొండి ప్రజా ప్రతినిధులను “రి కాల్” చేసి పదవినుంచి తొలగించాలి అనే ఉద్యమ భావజాలం కూడా మన పిఠాపురం ప్రజలు అలవర్చుకుంటే మన పిఠాపురాన్ని మనమే అభివృద్ధి చేసుకోవచ్చు.. ప్రజలు పాలకులనుంచి మంచి సేవలు ఎలా కోరుకుంటున్నారో.. అదే విధంగా ప్రజలు కూడా సుపరిపాలన అందించే మంచి సేవకులను ఎలక్షన్లలో ఎన్నుకోవాలి.. ఇక్కడ సుపరిపాలన అంటే.. ప్రభుత్వ నిర్ణయాలు అమలు, పాలనలో ప్రజల భాగస్వామ్యం, రాజకీయ & కార్యనిర్వాహక జవాబిదరితనం, సమస్యలపై స్పందన, ఈక్వాలిటీ & ఇంక్లూజివ్ నెస్, రూల్ ఆఫ్ లా, పారదర్శికత (ఆంటీ కరప్షన్) లక్షణాలు ఎలెక్షన్ లో మనం ఎన్నుకునే వ్యక్తికి ఉండాలని మన పిఠాపురం ప్రజలందరు తెలుసుకొవలి.  పిఠాపురాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలవాలంటే, సమగ్ర అవగాహన, సమీకృత అభివృద్ధి  కాంక్షించి ప్రజల పక్షాన నిలిచే సేవకులను, రాజకీయ పార్టీలకు, కులమతాలకు అతీతంగా ఎన్నికొని పిఠాపురం ప్రజల సంక్షేమంలో నియోజకవర్గ అభివృద్ధిలో పిఠాపురం ప్రజలందరు  భాగస్వామ్యం కావాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ సందర్భంగా పిఠాపురం ఆత్మీయ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.. ముఖ్యంగా నోటుతో పవిత్రమైన ఓటును కొని మన జీవితాలతో జూదం ఆడాలనుకుంటున్న రాజకీయ నాయకులతో అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ..  అవినీతిని   ఎదుర్కోవడం “దేశభక్తి” తో సమానమని ప్రజలు అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

తూతిక శ్రీనివాస విశ్వనాధ్, MBA, LLM, మాజీ సైనికుడు, మండల అభివృద్ది అధికారి, తూర్పు గోదావరి జిల్లా, 7675924666

Topics