NEWS

​ఆదమరిస్తే అంతే…

పిఠాపురం : ప్రజల ప్రాణాలు పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిద్రావస్థవలో వున్నారన్నది ఈ సంఘటన చూస్తే తేటత్లెమౌతుంది. 
పట్టణంలోని స్థానిక పూర్ణా థీయేటర్‌ సమీపంలో వున్న రెయిలింగ్‌ వంతెన ప్రమాద భరితంగా మారింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఇందిరానగర్‌, పట్టణంలోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాదుకు అనుసంధానమయ్యే రోడ్డుకు చేరుకోవడానికి ఏర్పరచిన కాలిబాట వంతెనకు ఇరువైపులా ఏర్పరిచిన రెయిలింగ్‌ ఒక వైపు పూర్తిగా విరిగిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. ఆ దారి గుండా నడిచే బాటసారులు, వాహనదారులు భయాంధోళనకు గురౌతున్నారు. 

ఏ నిమిషానా ఏం జరుగుతుందోనన్న సందిగ్ధంలో ప్రజలు వున్నారు. రెయిలింగ్‌ ఊడిపోవడంపై అధికారులకు పిర్యాధు చేసినా పట్టించుకున్న ధాఖలాలు లేవు. ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లింతరువారుత చర్యలు తీసుకునేదానికన్నా, ముందస్తు చర్యలు తీసుకుని ప్రజ ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దారి గుండా బాటసారులు, ద్విచక్రవాహనదారులు ప్రయాణిస్తున్న అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేక ఎవరి ఏమైతే మాకేంటి అన్న చందాన వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే…!

By – Mr.Y. S. V. V. Suneel Kumar,  Kumarjournalist555@gmail.com

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics