NEWS

​పిఠాపురంలో చెలరేగుతున్న మట్టి మాఫియా -ప్రజా ప్రతినిధుల అండదండలతో సాగుతున్న దందా -చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం.

 పిఠాపురం:  పిఠాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో మట్టి దందా బహు జోరుగా సాగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాల ఉపయోగిస్తూ వందలాది ట్రాక్టర్లు,లారీలతో కాలవ గట్టను, రైతు పేరుతో పంట పొలాలను మరియు ఖాళీ స్థలాల లో ఉన్న మట్టిని అక్రమార్కులు యథేచ్ఛగా తరలించుకుపోతూ సొమ్ము చేసుకుంటున్న సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పిఠాపురం మండలం లోని గోకివాడ, జమల పల్లి, పి రాయవరం, దొంతమూరు మరియు పలు గ్రామాల రోడ్లను ధ్వంసం చేసుకుంటూ అక్రమంగా మట్టిని అక్రమార్కులు యథేచ్ఛగా తరలించుకుపోతున్న అధికారులు ఎవరు నోరు మెదపకపోవడం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
రైతులకు ప్రధాన నీటి వనరు అయిన ఏలేరు కాలువ గట్ల ను ధ్వంసం చేస్తూ మట్టిని, ఇసుకను యథేచ్ఛగా తరలించుకు పోవడంతో పలుచోట్ల ఏటిగట్టు బలహీనంగా మారింది. రైతుల పేరుతో పంట పొలం లోని మట్టిని ప్రోక్లీనర్లను ఉపయోగిస్తూ ఇటుక బట్టీలకు, ఇంటి పునాదులకు బహిరంగంగా తరలించుకుపోవడం వెనుక పెద్ద నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వేసిన రహదారులు సైతం వీటి తాకిడికి చిందరం అవుతున్నాయి. సంవత్సరం పొడుగునా సాగుతున్న ఈ అక్రమ మట్టి, ఇసుక దందా వెనుక భారీగానే ముడుపులు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమ మట్టి, ఇసుక దందాలు అరికట్టాలని, ఏటి గట్లను మరియు రహదారులను రక్షించాలని పలువురు రైతులు ప్రజలు కోరుతున్నారు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics