NEWS

​అర్చకుల పై వేధింపులు–పురుగుల మందు తాగిన అర్చకుడు – పరిస్థితి విషమం.

కాకినాడ: అర్చకుల పరిస్థితులు రానురాను దిన దిన గండంగా మారుతున్నాయి. ట్రస్టీల వేధింపులు భరించలేక దేవుని సేవ చేయాల్సిన అర్చకులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొంది. అలాంటి సంఘటన రామచంద్ర పురం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది ప్రయివేటు యాజమాన్యం లో ఉంది. గత కొంతకాలంగా ఈ అర్చకుని పై చైర్మన్ వారి కుటుంబ సభ్యుల వేధింపులు అధికమైయ్యాయి. అర్చకుడ్ని తిట్టడం పని మనిషిలా పని చేయించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలో  వేధింపులు ఎక్కువడంతో బుధవారం ఎలుకల మందుతాగి అర్చకుడు పానింగపల్లి ఫణి ఆత్మహత్య కు పాల్పడ్డారు. కళ్ళు తిరిగి విషమ పరిస్థితి లోకి వెళ్లిన అతన్ని స్థానికులు వెంటనే కాకినాడ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెల్సిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ డి ఎల్ ఓ డి హెచ్ వి సాంబశివరావు,అర్చక సమాఖ్య కార్యదర్శి ఆచార్యులు. నాయకులు శ్రీనివాస్, కేశవుడు, గుడిపాటి ఫణికుమార్లు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యుల తో మాట్లాడారు.. ఐసియు లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు.72 గంటల పాటు అబ్సర్ ర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారు. పెద్ద ఎత్తున అర్చకులు, పురోహితులు,బ్రాహ్మణులు ఆసుపత్రికి చేరుకున్నారు. చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
By- Mr.Rowthu prasanna kumar 9182318880

Topics