NEWS

​చెత్తను తొలగించండి మహాప్రభో.

గొల్లప్రోలు : గొల్లప్రోలు పట్టణ పరిధిలో మార్కండేయపురం మంచి నీటి నుయ్యి సమీపంలోని సూర్యుడు చెరువు గట్టు వద్ద పెంటకుప్పలు రోజురోజుకు పెరిగిపోతున్నా పట్టించుకున్న ధాఖలాలులేవు. ఆ పరిసరాలలో నివసిస్తున్న ప్రజలు తరచూ అనారోగ్యంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం వహించిన గొల్లప్రోలు శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మి పై గత నెలలో స్థానిక ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ మండిపడ్డా, సంస్పెండ్ చేసినా పారిశుధ్యం మాత్రం మెరుగు పడటంలేదు. దీనిపై ఇప్పటికైనా గొల్లప్రోలు మున్సీపాల్టీ సిబ్బంది ఈ చెత్తను తక్షణమే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
By

Y. S. V. V. Suneel Kumar,
Kumarjournalist555@gmail.com

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics