NEWS

​బీసీ నాయకులతో ఎమ్మెల్యే వర్మ సమావేశం.

పిఠాపురం : స్థానిక ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం బిసి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం బీసీ భవనానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు.బీసీ నాయకులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేస్తున్నారని అలాగే జైహో బీసీ సంబంధించి సమావేశం కూడా బీసీ భవన్ శంకుస్థాపన రోజున నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజవర్గంలో మొత్తం 30 బీసీ భవనాలు ఇవ్వడం జరిగిందన్నారు.

అలాగే పట్టణంలోని 40సెంట్లు స్థలంలో రూ.50 లక్షలతో నిర్మించిన జరుగుతుందన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక లాంటి వారిని, బీసీ లో ఉన్న ఉప కులాలు అన్ని కూడా శంకుస్థాపనకు భారీగా తరలిరావాలని కోరారు.అనంతరం మండలంలోని రాపర్తి గ్రామానికి చెందిన గుల్లంపూడి శ్రీనివాస్ కి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుండి రూ.2లక్షల రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.
Y.S.V.V. SUNEEL KUMAR
kumarjournalist555@gmail.com – 9642213459.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics