NEWS

​సబ్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమినిస్టర్ రాజప్ప, ఏపి డిజిపి ఠాకూర్

పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో సుమారు కోటి రూపాయలుతో నూతనంగా నిర్మించిన సబ్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభం చేసిన రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పా, ఏపీ.డీజీపీ ఆర్పీ.ఠాకూర్.బుధవారం పెద్దాపురం డి.ఎస్పీ చిలక వెంకటరామారావు ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిలు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సామర్లకోట పెద్దాపురం రోడ్లో నిర్మించిన సబ్ డివిజన్ కార్యాలయం మరియు డిఎస్పీ గెస్ట్ హౌస్ ను మంత్రి,డిజిపి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు బాధ్యత చాలా కీలకం అని నిరంతరం ప్రజలుకు అందుబాటులో ఉండాలని నూతనంగా కార్యాలయన్నీ నిర్మించడాం జరిగింది అని అన్నారు.అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఒక చోట ఉంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవు అని ఇక్కడే అన్ని కార్యాలయాలు నిర్మిస్తున్నమని అన్ని రాబోయే రోజుల్లో ఎంపిడిఓ కార్యాలయాన్ని ప్రారంభించడానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నేరాలు అదుపులోఉన్నాయి అని మంత్రి తెలిపారు. 

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరికి పోలీసు స్టేషన్ దగ్గరలో సొంత గృహాలు నిర్మించి ఇస్తామని ఆయన తెలిపారు.శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పోలీసులు ప్రజలను రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అని అన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్,పెద్దాపురం డిఎస్పీ చిలక వెంకట రామారావు,మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు,మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యల రాజా అబ్బాయి, జడ్పీటీసీ సుందరపల్లి శివ నాగరాజు,13 కౌన్సిలర్ కందుల  జన్సీ లక్ష్మీ, పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ యువ కుమార్,సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్ల కృష్ణా భగవన్ తదితరులు పాల్గొన్నారు.
Y. S. V. V. Suneel Kumar
Kumarjournalist555@gmail.com,

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics