NEWS

​ప్రతి ఒక్కరు యోగా పై అవగాహన కలిగివుండాలి- డా॥పరిగి రామచంద్ర జీ

Pitapuram : ప్రతి ఒక్కరు యోగాపై అవగాహన కలిగి వుండాలని యోగా గురువు డా॥పరిగి రామచంద్ర అన్నారు. బుధవారం పట్టణంలోని స్ధానిక సూర్యరాయ విద్యానంద గ్రంధాలయంలోని చెలికాని భావనరావు సభాసదన్‌లో డా॥ పరిగి రామచంద్ర ఆధ్వర్యంలో యోగాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానము, ఓంకార మంత్రోచ్ఛారణ క్రమబద్ధంగా చేయడం వలన మానవుడు మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాడని దీని ద్వారా వ్యాధులు కూడా దూరమౌతాయని తెలియజేశారు. 

ప్రతిరోజు సూర్యనమస్కారాు చేయడం వలన శరీరంలోని ప్రతి అవయము ఆరోగ్యంగా తయారౌతాయని తెలిపారు. ప్రస్తుతమున్న వేగవంతమైన యుగంలో ప్రతిరోజూ ఒక గంట యోగా చేయడం వలన రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపవచ్చని, ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలియజేశారు. పిల్లలు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారన్నారు. ధ్యానం ద్వారా విశ్వశక్తిని శరీరం గ్రహించి  శరీరంలోని రుగ్మతన్నీ దూరమౌతాయని, ప్రతి ఒక్కరూ రోజులో ఒక గంట యోగా కోసం కేటాయించాలన్నారు.  ఈ అవగాహన సదస్సులో పతంజలి యోగా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌, డిఈఈ శేషగిరిరావు, భాను, ఏడుకొండలు, నాగేశ్వరరావు, శంకర్రావు, మురళీ, సూరెడ్డి, పద్మ, నాయుడు, గిరి, బషీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Y.S.V.V. SUNEEL KUMAR
kumarjournalist555@gmail.com,9642213459.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics