NEWS

పులివర్తి నాని గెలుపు చంద్రగిరి నియోజకవర్గం అభివృద్దికి మలుపు -పులివర్తి సుధా రెడ్డి

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ది పథంలో నడిపించాలి అంటే పులివర్తి నానిని ఎమ్మెల్యేగా గెలిపించాలని గురువారం ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డి ఒటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి పట్టణంలో మూడవ సెగ్మెంట్ లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి అని,ఇందులో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించామని చెప్పారు.టిడిపి పార్టీ ప్రచారంలో భాగంగా బందువులను,స్థానిక ప్రజలను పలుకరిస్తూ ఆప్యాయంగా వారితో ముచ్చటించి నాని గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.నానికి ఓటు వేస్తామని ఆయన గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని స్థానిక మహిళలు హామీ ఇచ్చారని చెప్పారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి పంచాయతీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Y. S. V. V. Suneel Kumar
Kumarjournalist555@gmail.com.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics