NEWS

​పాండవూలమెట్టపై ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి.

పెద్దాపురం : పెద్దాపురం పట్టణం అమరగిరి అయిన పాండవులు మెట్ట పై సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.శ్రీ పంచాయతన నవగ్రహ సూర్యనారాయణమూర్తి కొండ పై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

https://youtu.be/Hw6rfAOIypA 
స్వామికి పంచామృతలతో అబీషేకం నిర్వహించారు.షష్ఠి సందర్భంగా నలుగురు దంపతులు  స్వామి వారికి పట్టుబట్టలుతో,ముత్యల తలంబ్రాలుతో స్వామి వారికి కళ్యాణం కన్నులు పండుగగా చేశారు.

ఆలయ కల్యాణ మండపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆలయ పండితులు షష్ఠి విశిష్టత భక్తులు వివరించారు.స్వామి వారి దర్శననికి అశేష జనవాహిని తరలివచ్చారు.అదేవిధంగా వచ్చిన భక్తులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త ఎడవిల్లి అనంత లక్ష్మీ దేవి ఆధ్వర్యంలో జరిగింది.

Y.S.V.V. Suneel Kumar
Kumarjournalist555@gmail.com.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics