NEWS

​సి ఎం ‘కె సి ఆర్’ ప్రమాణస్వీకారం పట్ల హర్షం.

కాకినాడ : తెలంగాణా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడింట రెండువంతుల ఎమ్మెల్యేల మెజారిటీతో కె సి ఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికయ్యి రెండవసారి పదవీబాధ్యతలు చేపడుతూ గవర్నర్ నరసిం హన్ గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయించడంపట్ల ఆంధ్రా కె సి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు సామాజికవేత్త దూసర్లపూడిరమణరాజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.కె సి ఆర్ రాబోయే కాలంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ద్వారా దేశంలో ఎన్ టి ఆర్ నెలకొల్పిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ తరహాలో నూతన రాజకీయ సమీకరణాలకు గాను కాంగ్రెస్ బి జె పి ఏతర ప్రభుత్వ ఏర్పాటుకు ముందడుగువేయనున్నారని తెలిపారు. ఆంధ్రా రాజకీయాల్లో కింగ్ మేకర్ పాత్ర కె సి ఆర్ దే నని పేర్కొన్నారు.

18వ తేదీన కె సి ఆర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నా మని తనను కలిసిన పాత్రికేయులకు రమణరాజు తెలియజేశారు.కె సి ఆర్ రెండురాష్ట్రాల తెలుగు ప్రజలకు ఫెడరల్ ఫ్రంట్ ద్వారా మెలైన ప్రజాప్రయోజనాలు విభజన హామీలు సాధించగలరన్న విశ్వాసం వుందన్నారు. 

కె సి ఆర్ అనూహ్య ఫలితాలతో ఎన్నిక వ్వా లని రమణరాజు ప్రసిద్ద పుణ్య క్షేత్రమయిన అన్నవరంలో తెలంగాణా ఎన్నికలముందు నూరుకొబ్బరికాయలతో నీరాజన హారతి సమర్పించి పూజాధికాలు చేయించి ఆంధ్రా కె సి ఆర్ ఫౌండేషన్ తరపున ఉభయ తెలుగురాష్ట్రాల్లో సంచలనాత్మకంగా ప్రసిద్దిచెందిన విషయం విదితమే.

Y. S. V. V. Suneel Kumar
Kumarjournalist555@gmail.com.
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics