NEWS

​అంగన్‌వాడీ కోడిగుడ్లు బహిరంగ మార్కెట్లో… అక్రమార్కుల చేతుల్లోకి అంగన్‌వాడీ కోడిగుడ్లు

పిఠాపురం : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు,బాలింతలకు పౌష్టికాహారంగా అందాల్సిన కోడిగుడ్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా ఎన్నాళ్ళనుండో కొనసాగుతున్నా సంభందిత అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫమవుతున్నారన్న వాదనులు ఉన్నాయి. కొద్ది రోజు క్రితం పాస్ట్‌ పుడ్‌ సెంటర్లలో దర్శనమిచ్చిన అంగన్‌వాడీ మార్క్‌ కోడిగుడ్లు నేడు షష్టి మహోత్సవాలో కనువిందు చేస్తున్నాయి. 


గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో సుబ్రమణ్యస్వామి షష్టి మహోత్సవాలో భక్తులు స్వామివారికి నైవేద్యంగా సమర్పించే కోడిగుడ్లలో . చిన్న పిల్లలకు, బాలింతలకు  అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారంగా అందాల్సిన కోడిగుడ్లు వచ్చి చేరండం అక్కడికి వచ్చిన వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది. కాదేది కవితకనర్హం  అన్నట్లుగా కాదేది వ్యాపారానికి అనర్హం అని గుడ్ల వ్యాపారులు  చాటిచెప్పారు. ఈవిషయంపై సంభందిత అధికారులెవరూ అందుబాటులోకి రాకపోవడం చూస్తుంటే అంగన్‌ వాడీ కేంద్రాల నిర్వహణపై ఏవిధంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఉన్నతాధికాయి తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
  R.prasanna Kumar  9182318880

Topics