NEWS

​త్రయ సాధన ద్వారా మనసుకు తృప్తి, ఆత్మకు ముక్తి-శ్రీవిశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి డా॥ఉమర్‌ ఆలీషా

పిఠాపురం: త్రయ సాధన ద్వారా మనసుకు తృప్తి, ఆత్మకు ముక్తి, శరీరానికి భుక్తి లభిస్తుందని శ్రీవిశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి డా॥ఉమర్‌ ఆలీషా అన్నారు. పిఠాపురం మండలం వెల్దుర్తి  గ్రామంలో గల శ్రీవిశ్వవిజ్ఞాన విధ్యా ఆధ్యాత్మిక పీఠం ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. ఆయన మాట్లాడుతూ దర్హ పరిరక్షణ ద్వారా మానవునిలో సత్‌ బావాలు ఏర్పడి సమాజంలో సుఖశాంతులతో జీవించగలడని, మానవ జన్మకు సార్ధక్యత లభిస్తుందన్నారు. సంసార ధర్మాన్ని పాటిస్తూ త్రయ సాధన ఆచరిస్తే జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందుతుందని పీఠాధిపతి తెలియజేసారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు ఒక మొక్కనాటాలని సూచించారు. ఈకార్యక్రమంలో స్ధానిక కన్వీనర్‌ బాస్కరరావు దంపతులు స్వామివారిని సలువాతో సత్కరించారు. పీఠం కన్వీనర్‌ పేరూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 R.Prasanna Kumar 9182318880

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics