NEWS

క్షతగాత్రులను పరామర్శించిన  యంపిడిఓ విశ్వనాథ్

రైటాఫ్.. మిరియాల గోవిందరావు చేయి విరిగిన వ్యక్తి, వాకతిప్ప, 2. గీసాల గణేష్ నించొని ఉన్న చిన్న కుర్రోడు, నిదానందొడ్డి.
ఉప్పాడ కొత్తపల్లి : శబరిమలై నుండి తిరిగివస్తు తమిళనాడులో బస్సు ప్రమాదానికి గురైన బాదితులను అంబాజీపేట మండల పరిషత్ అభివృద్ధి అదికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పరామర్శించారు. సమారు నలబైమంది అయ్యప్ప భక్తులు ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప, కుతుకుడుమిల్లి గ్రామాల నుండి శభరిమళై అయ్యప్ప ధర్శినానికి వెళ్ళి ధర్శనానంతరం తమిళనాడులో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన సంఘటన తెలిసిందే. 

ఈ ప్రమాదంలో ఐశెట్టి సూర్యవతి మరణించగా పలువురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన వారిని అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా మిగిలినవారు స్వగ్రామానికి గురువారం తిరిగిరావడం జరిగింది. సంధర్భంగా యంపిడిఓ విశ్వనాథ్  కుతుకుడిమిల్లి,  నిదానందొడ్డి, వాకతిప్ప ప్రాంతాలలో ఉంటున్న బాదితులను పరామర్శించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరాతీసారు. ప్రమాద ఘటనపై విశ్వనాథ్ ద్రిక్భ్రాంతి వ్యక్తం చేస్తు సంఘటన చాలా దురదృష్టకరమని,  ప్రమాదానికి గురైన బాదితులు వ్యవసాయ కూలీలు, నిరుపేదలైనందున  ప్రభుత్వం అన్నివిదాల ఆదుకోవాలని అన్నారు. తాను కూడా బాదితులకు అన్ని విదాల సహకరిస్తానని విశ్వనాథ్ అన్నారు. కార్యక్రమంలో వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి రొబ్బి నటరాజ్, దళిత నాయకుడు సోంబాబు, బీసి నాయకులు గింజాల రాజు, రాయుడు శివ, కర్రి మహేష్, దుర్గా ప్రసాద్ తదితరులు పరామర్శించింన వారిలో ఉన్నారు.
తూతిక శ్రీనివాస విశ్వనాథ్, మండల పరిషత్ అభివృద్ధి అదికారి, అంబాజీపేట, 7675924666

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss