NEWS

​వివేకానందపార్కులో కుక్కలబెడద తొలగించాలి

కాకినాడ : వీధికుక్కల సంఖ్య నగరంలో ఎక్కువయ్యిందని స్థానిక వివేకానందపార్కులో కుక్కలబెడద మరింత తీవ్రంగా వుందని మాజీమున్సిపల్ కౌన్సిలర్ సామాజికవేత్త దూసర్లపూడిరమణరాజు పేర్కొ న్నారు.ఉదయం సాయంత్రం వేళల్లో వ్యాయామం కోసం వ్యాహళికి వచ్చేవారు ఆహ్లాదంకోసం పార్కు సందర్శనకువచ్చేవారు కుక్కల బెడద తో ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.వీధికుక్కల నియంత్రణ కు నిర్ధిష్ట చర్యలు లేకపోవడం వలన ఈ దుస్తితి మరింత పెరిగిందన్నారు.బ్లూ క్రాస్ వారు కుక్కలను చంప కూడదని న్యాయస్తానం ద్వారా జంతుహింసలేకుండా నివారించాలని మాత్రమే కోరారని విచ్చల విడిగా వీధికుక్కలను వుంచాలని మాత్రం వారుకోరలేద న్నారు. బ్లూ క్రాస్ డిమాండ్ ని  సాకుగా చేసుకుని  వీధికుక్కల నియంత్రణకు చర్య లు లేకుండా చేతులెత్తేయడం దురదృష్టకరమన్నారు. నగరంలో విచ్చల విడిగా తిరుగుతున్న వీధికుక్కలకు డీవార్మింగ్ మరియు స్టెరిలైజేషన్ నిర్వహించే ఎ బి సి మరియు ఎ ఆర్ వి ఆపరేషన్లు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంచేయడం వలన వీధి కుక్కల బెడద పెరిగింద న్నారు. వీధికుక్కల సంతతి నియంత్రించేందుకు ప్రజా సంక్షేమం రీత్యా ఎ బి సి మరియు ఎ అర్ వి ఆపరేషన్లు పక్కాగా చేపట్టే చర్యలు అధికారులువహించాలని కోరారు. స్మార్ట్ సిటీలో డాగ్ పార్కు ఏర్పాటుకు తగిన స్థలం కేటాయించి వీధికుక్కలను డాగ్ పార్కుకు తరలించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గతంలో వీధికుక్కల దాడి కారణంగా నగరంలోని ఓ బాలుడు అకారణంగా మృతి చెందినప్పటికీ కార్పోరేషన్ ఎటువంటి శ్రద్ద చూపకపోవడం విచారకరమన్నారు.
Y.S.V.V. SUNEEL KUMAR
Kumarjournalist555@gmail.com
9642213459.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics