NEWS

​’కె సి ఆర్’ విజయసంబరాలకు – ఓర్వలేకపోతున్న ‘చంద్రబాబు శ్రేణుల’  తీరు శోచనీయం  గన్ని విమర్శలు అర్దరహితమన్న దూసర్లపూడి 

కాకినాడ : తెలంగాణా తెలుగురాష్ట్ర ఎన్నికల్లో రెండింట మూడొంతుల ఆధిక్యతను సాధించి రెండవసారి ముఖ్యమంత్రి అయిన కె సి ఆర్ పట్ల అభిమానంతో అన్నిపార్టీలలోనూ అన్నివర్గాల తెలుగుప్రజలు దేశవిదేశవ్యాప్తంగా హర్షంవ్యక్తం చేస్తుండగా చంద్రబాబు శ్రేణులుమాత్రం కె సి ఆర్ విజయసంబరాలను చూసి ఓర్వలేకపోతున్నారని ఆంధ్రా కె సి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాకినాడ కార్యాలయంలో గుడా చైర్మన్ గన్నిక్రిష్ణ కె సి ఆర్ పై చేసిన విమర్శలు అర్ధరహితమన్నారు.ఆంధ్రా అంటే చంద్రబాబు చంద్ర బాబు అంటే ఆంధ్రా అన్నట్టుగా బాబుశ్రేణులు భావిస్తున్నారని ఆంధ్రా అయినా తెలంగాణా అయినా ఎవరి స్వంతమూ కాదని తెలుగురాష్ట్రాల్లో స్వార్ధప్రయోజనాల కోసం లక్ష్మణ రేఖచందాన పబ్బం గడుపుకునే తాపత్రయం చంద్రబాబుదేనని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్ టి ఆర్ ఆభిమానులు యై ఎస్ ఆర్ సి పి జనసేన బి జె పి వామపక్షాలు బి ఎస్ పి ఆం ఆద్మీ మున్నగు అన్నిపార్టీల్లోనూ కె సి ఆర్ అభిమానులునారని రమణరాజు పేర్కొన్నారు.కె సి ఆర్ మాటెత్తితే పాకిస్థాన్ విద్రోహం అన్నట్టు గా చంద్రబాబు శ్రేణులు శివాలెత్తుతున్న తీరు రాజ్యాంగరీత్యా భారతదేశ సమగ్రతకు మంచిదికాదన్నా రు. తెలంగాణా తెలుగురాష్ట్రంలోని సెటిలర్స్ ఆంధ్రులు సైతం చంద్రబాబు కాంగ్రెస్ తో చేసుకున్న అనైతికపొత్తుని  చిత్తుచిత్తుగా ఓడించారని దీనినిజీర్ణించుకొలేక కె సి ఆర్ గెలిస్తే ఇక్కడి ప్రతిపక్షాలు సంబరాలుచేసుకుంటాయా అని ఎలుగెత్తుతున్న తీరు వారి అభద్రతాభావానికి ప్రతీకగా వుందని రమణరాజు పేర్కొన్నారు.  

Y.S.V.V. SUNEEL KUMAR
Kumarjournalist555@gmail.com
9642213459.
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics