NEWS

​నెలలు నిండిన గర్భిణులను ఆసుపత్రికి తరలించండి  -ఎంపీడీఓ విశ్వనాధ్

కాట్రేనికోన : నెలలు నిండిన గర్భిణులను కుటుంభం సభ్యుల అనుమతితో సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించమని చిర్రయానాం, నీలరేవు  తీరప్రాంతాలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారి అంబాజీపేట మండల పరిషద్ అభివృద్ధి అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ వైద్య సిబ్బందికి సూచించారు. ఫేథాయ్ తుఫాను విధులలో భాగంగా కాట్రేనికోన మండలానికి వచ్చిన విశ్వనాధ్ ముందుగా చిర్రయానం సందర్శించి స్థానిక అధికారులతో బహుళ ప్రయోజన తుఫాను భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడుతూ, తుఫాను తీవ్రత వలన ప్రజలకు, పశువులకు ఎటువంటి నష్టం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారని అన్నారు. నిత్యావసర వస్తువులు, త్రాగు నీరు, మందులు అందుబాటులో ఉన్నాయని  అవసరమనుకుంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వాహనాలు సిద్దం చేసామని గ్రామస్థులను ఉద్దేశించి అన్నారు. అయితే చిర్రయానం తీరప్రాంతం అయినందున ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండలని సూచించారు. తుఫాను భవనం వద్ద జనరేటర్ ఏర్పాటు చేసి విద్యుత్తు సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చారు.  అనంతరం వైద్యశిభిరాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్సులు సత్యాల వెంకటరావు, దుర్గాప్రసాద్, గ్రామ రెవిన్యూ అధికారి గుత్తుల విష్ణుమూర్తి, యంపిటిసి బొమ్మిడి సూరిబాబు, మాజీ సర్పంచ్ అంగాని నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

R.prasanna Kumar 9182318880

Topics