NEWS

వెంకటరమణ హత్య కేసును చేధించిన పోలీసు

అక్రమ సంభందమే హత్యకు కారణం                                   -వెంకటరమణ హత్య కేసును చేధించిన పోలీసు
-నిందితు అరెస్టు, అందులో నలుగురు మైనర్లే

రాజమండ్రి : బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈనెల 5వతేదీన హత్యకు గురికాబడిన వెంకటరమణ హత్యకేసును పోలీసు

చేదించారు. నిందితును అరెస్టు చేసారు. అందులో నలుగురు మైనర్లే కావడం గమనార్హం. పోలీసు కధనం ప్రకారం ఈనెల

5వ తేదీన కాదా దుర్గాప్రసాద్‌కు చెందిన తోటలో వెంటరమణ అనే వ్యక్తి చీకట్ల సతీష్‌ అనే వ్యక్తి చేతిలో హత్యకు గురైనట్టు

వి.ఆర్‌.ఓ ఇచ్చిన పిర్యాధు మేరకు కేసు నమోదైంది. విచారణ చేపట్టగా  కడియం మండం కడియపు సామవరం గ్రామానికి చెందిన చీకట్ల సతీష్‌(26) ఎమ్‌.బి.ఎ చదువుకుని కడియం గ్రామంలో స్ధానికంగా ఉన్న నర్సరీ తోటలో గుమస్తాగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన గుబ్బ వీరవెంకటరమణ భార్య అయిన జ్యోతితో పరిచయం ఏర్పడిన క్రమంలో వీరిద్దరూ ఒక సంవత్సరకాలంగా అక్రమ సంభందం పెట్టుకున్నారు. సతీష్‌కు వివాహమై 6 నెలైనప్పటికి అక్రమ సంభందం కొనసాగింది. విషయం తొసుకున్న ఇరివురు కుటుంబ సభ్యులు వీరిద్దరిని మందలించారు. జ్యోతి భర్త వెంకరమణ

సతీష్‌ను హెచ్చరించి జ్యోతిని అదుపులో పెట్టాడు. వీరు కలుకుసుకోవడం వీలుపడక వెంకటరమణపై సతీష్‌ కక్ష పెంచుకుని ఎలాగైనా వెంకటరమణను చంపి అడ్డు తొగించుకోవాలనుకుని పధకం వేసి జ్యోతికి చెప్పగా ఒప్పకుంది.ఈ నేపద్యంలో

సతీష్‌కు పరిచయమున్న మడికి గ్రామానికి చెందిన లావేటి నాగమణికి విషయం చెప్పి సహహకరించమని, పనిపూర్తైన తరువాత

కొంత సొమ్ము ముట్ట చెబుతానని ఆశచూపారు. ఈక్రమంలో సతీష్‌ కొత్త సిమ్‌ తీసుకుని నాగదేవికిచ్చి వెంకటరమణకు పోన్‌ చేయించాడు. నాగదేవి లౌక్యంగా మాట్లాడటంతో వెంకటరమణకు నమ్మకమేర్ప డింది. అవకాశంకై ఎదురు చూస్తున్న సతీష్‌

తనకు తెలిసిన పిడిగొయ్యి శివారు ట్రిప్స్‌స్కూల్‌ దగ్గరలోగల నర్సరీ మరియు కొబ్బరితోటలోగల రేకుషెడ్డులో ఉన్న గదిలోనికి

నాగదేవి ద్వారా వెంకటరమణను ది4/12/2018 రాత్రి రప్పించి, తన రూ॥5000 వేలు ఇచ్చి రప్పించిన 8మంది వ్యక్తులకు

బీయి త్రాగించి, కొన్ని బీరులతో రేకు షెడ్డు వద్ద లైట్లు ఆఫ్‌చేసి ఇద్దరు వ్యక్తులు గదిలో ఉన్న వెంకటరమణను బయటకు  ఈడ్చుకుని రాగా సతీష్‌ బీరు సీసాతో వెంకరమణ నెత్తిపై మోదగా అతను క్రింద పడిపోయాడు. మిగిలినవారు కూడా వెంకటరమణను కాళ్లతో తన్ని చేతుతో కొట్టగా సృహకోల్పోయాడు. మొహంపై బీరు ఓపెన్‌ చేసి కొట్టగా అతను కళ్ళు తెరిచి చూసాడు. అక్కడున్న వారంతా కలిసి  అతన్ని కొబ్బరి చెట్టు వద్దకు లాక్కొచ్చి చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా అతను గింజుకొనుచుండగా అక్కడున్న నీటి పైపు మరియు పురుకొసతో కొబ్బరిచెట్టుకు కట్టారు. రాత్రి12:30 వరకు ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు కొట్టరు. సతీష్‌ రేకు షెడ్డులో ఉన్న పదునైన కత్తితో వెంకటరమణ పీకపై బలంగా నరికాడు. గెడ్డం వద్ద తీవ్రగాయమైంది.

సతీష్‌ చేతిలో ఉన్న కత్తిని చోటా లాక్కుని కంటి బాగంలో తీవ్రంగా గాయపరిచాడు. అదే కత్తితో సన్నీ నరకగా కుడికాలర్‌

బోనుకు గాయమైంది. సతీష్‌ కత్తి తీసుకుని ఈనాకొడుకు నాకే వార్నింగ్‌ ఇచ్చాడని, వీడు చస్తే జ్యోతితో సంతోషంగా ఉంటానంటూ కసితీరా వెంకటరమణనను నరుకగా తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం జరుగటంతో అతను చనిపోయాడు. 

వెంకటరమణ శవాన్ని తోటబయట ఉన్న తాటిచెట్టువద్ద తుప్పల్లో దాచి కత్తిని కొంతదూరంలో పడవేసి వెళ్ళిపోయారు. మరునాడు  అనగా 15/12/2018న సతీష్‌ వచ్చి సారాపొయ్యి అంటూ తనకు తెలిసినవారితో గొయ్యి తీయించి శవాన్ని పూడ్చుటకు

అక్కడ తిరుగుచుండగా తోట యజమాని మరియు కాపలాదారు గమనించి నిలదీయగా జరిగింది చెప్పి సతీష్‌ పారిపోయాడు.

ధర్యాప్తులో బాగంగా ది14/12/2018 శుక్రవారం ఎ1)చీకట్ల సతీష్‌, సహకరించిన కడియంగ్రామానికి చెందిన గంతేటి దుర్గాప్రసాద్‌ అలియాస్‌ పండు, కప్ప రవికుమార్‌ అలియాస్‌ రవి, బడుగు రాజేష్‌, బండపల్లి తరుణ్‌ మరియు నలుగురు

మైనర్లు కానవరం గ్రామంలో సతీస్‌తో కలిసి ఉన్నారనే సమాచారంతో బొమ్మూరు ఎస్సై మోహన్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి

దాడి చేసి 9మందిని అరెస్టు చేసారు. వారివద్దనుండి కత్తి, 3సెల్‌ఫోన్ లు మృతునిసెల్‌ఫోన్‌1, గ్లామర్‌ మోటర్‌ సైకిల్‌ను, ఒక 

ఎక్స్‌ ఎల్‌ మోపెడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 5గురు ముద్దాయిలు,4గురు మైనర్లు ఉన్నట్టు గుర్తించారు. హత్యకు సహకరించిన

గుబ్బజ్యోతి, నాగదేవిను అరెస్టు చేయాల్సిఉంది. వారి అచూకి ఇంకా తెలియరాలేదని పోలీసు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఎస్పి కుమారి పే ముషి బాజ్ పేయి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి కె.లతామాధురి మరియు తూర్పు మండల డి.ఎస్.పి యూ. నాగరాజుల పర్యవేక్షణలో బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.యన్ మోహన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సహకరించిన ఎస్సై యూ వి ఎస్ నాగబాబు వారి సిబ్బంది ఎస్ భీమరాజు, వై రామకృష్ణ, ఎస్ కే సీలార్, ఎస్ ధనరాజు, కే సురేష్, బి విజయ్ కుమార్, కే అప్పారావు, ఎన్ వి రామయ్య, బి చిన్న బాబు, పి వెంకటేశ్వరరావు, ఎం రమేష్ బాబు, కే కుమార్, ఏ రమణబాబు, జి వి ఆర్ కే మూర్తి, డానియల్ బాబు, హెచ్ డి శ్రీను లను ఎస్పి మేడం అభినందించారు. 

Rowthu prasanna Kumar , 9182318880

Topics