NEWS

​అన్ని వర్గాల ప్రజలు YSRCP – పెండెం

అన్ని వర్గాల ప్రజలు వైయస్సార్ సిపి కి అండగా ఉన్నారు. -వైయస్సార్ సిపి కోఆర్డినేటర్ పెండెం దొరబాబు పిఠాపురం :అన్ని వర్గాల ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని పిఠాపురం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు అన్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక 9,10 వార్డ్ లో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాలతో కూడిన కరపత్రాలను అందించి పార్టీ సిద్ధాంతాలను వివరించారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబు మాట్లాడుతూ అట్టడుగు బడుగు బలహీనవర్గాల కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అభివృద్ధి సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సుపరిపాలన సాధ్యమని తెలిపారు. మిరపకాయల వీధికి చెందిన పిల్లి పండు పెండెం దొరబాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బొజ్జ అయ్యలు, పాలిక ప్రవీణ్ కుమార్,బొజ్జ దొరబాబు, నడిగట్ల చింతల రావు, బోను దేవా, వజ్రపు వీరేష్,పచ్చి మళ్ళ అప్పలరాజు,కర్రి ప్రసాద్,నల్లమిల్లి పవన్ కుమార్, చందు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 
R.PRASANNA KUMAR 9182318880,

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics